అయోధ్యకు ఇటుకల తరలింపు

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మరోసారి కదలికలు మొదలయినట్టు కనిపిస్తోంది.  వివాదాస్పద ప్రాంతంలోకి వీహెచ్‌పీ శ్రేణులు ఏకంగా ఇటుకలు తరలింపు మొదలుపెట్టాయి. రామాలయ నిర్మాణం కోసం రెండు ట్రక్కుల గ్రానైట్ రాళ్లు, ఇటుకలను  తాజాగా తీసుకొచ్చారు. మరిన్ని ట్రక్కుల ఇటుకలు రాబోతున్నాయని వీహెచ్‌పీ నేతలు చెబుతున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సమయం అసన్నమైందని ఆలయ నిర్మాణానికి సంబంధించి మోదీ ప్రభుత్వం నుంచి తమకు సంకేతాలు అందాయని రామ్‌ జన్మభూమిన్యాస్ అధ్యక్షుడు మహంత్‌ గోపాల్ చెప్పారు. 2017లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ మరోసారి రామాలయ అంశాన్ని […]

Advertisement
Update: 2015-12-20 23:29 GMT

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం మరోసారి కదలికలు మొదలయినట్టు కనిపిస్తోంది. వివాదాస్పద ప్రాంతంలోకి వీహెచ్‌పీ శ్రేణులు ఏకంగా ఇటుకలు తరలింపు మొదలుపెట్టాయి. రామాలయ నిర్మాణం కోసం రెండు ట్రక్కుల గ్రానైట్ రాళ్లు, ఇటుకలను తాజాగా తీసుకొచ్చారు. మరిన్ని ట్రక్కుల ఇటుకలు రాబోతున్నాయని వీహెచ్‌పీ నేతలు చెబుతున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సమయం అసన్నమైందని ఆలయ నిర్మాణానికి సంబంధించి మోదీ ప్రభుత్వం నుంచి తమకు సంకేతాలు అందాయని రామ్‌ జన్మభూమిన్యాస్ అధ్యక్షుడు మహంత్‌ గోపాల్ చెప్పారు.

2017లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ మరోసారి రామాలయ అంశాన్ని తెరపైకి తెస్తున్నట్టు అనుమానిస్తున్నారు. తన జీవిత కాలంలోనే రామ మందిర నిర్మాణం జరుగుతుందని ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్‌ భగవత్ వ్యాఖ్యానించడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయోధ్యకు ఇటుకలు, గ్రానైట్ బండల తరలింపుపై స్థానిక పోలీసులు ఆచితూచీ మాట్లాడుతున్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీస్తున్నామని ఫైజాబాద్ ఎస్పీ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News