ఏమిటి ఈ వాదులాట... ఇద్దరు లీడర్లకు బాబు క్లాస్

గురువారం రాత్రి ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో నల్లగొండ జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. కొంతకాలంగా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉమమాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వాగ్వాదానికి దిగారు. భువనగిరిని కొత్త జిల్లా కేంద్రంగా చేయాలని ఉమామాధవరెడ్డి చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. మోత్కుపల్లి కూడా యాదగిరిగుట్టను జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశమే […]

Advertisement
Update: 2015-12-17 22:31 GMT

గురువారం రాత్రి ఎన్టీఆర్‌ ట్రస్ట్ భవన్‌లో నల్లగొండ జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. కొంతకాలంగా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఉమమాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి వాగ్వాదానికి దిగారు. భువనగిరిని కొత్త జిల్లా కేంద్రంగా చేయాలని ఉమామాధవరెడ్డి చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. మోత్కుపల్లి కూడా యాదగిరిగుట్టను జిల్లా కేంద్రం చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అంశమే వీరిద్దరి మధ్య చిచ్చుపెట్టింది.

click to read:పవన్‌ పుస్తక రచయితకు భద్రత

సమావేశంలో టీటీడీపీ నాయకత్వంపై ఉమామాధవరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . మోత్కుపల్లి నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు హాజరై సంఘీభావం తెలిపిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ… తాను నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు ఎందుకు హాజరుకాలేదని సమావేశంలో ఆమె ప్రశ్నించారు. నాయకత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సమయంలోనే ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి మధ్య వాగ్వాదం చెలరేగింది. చంద్రబాబు సమక్షంలోనే తీవ్రస్థాయిలో వాగ్వాదం జరగడంతో మిగిలిన నేతలంతా అవాక్కయ్యారు. వెంటనే జోక్యం చేసుకున్నచంద్రబాబు ఇద్దరు నేతలపై సీరియస్ అయ్యారు. ఏమిటీ వాదులాట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉంటే తన దగ్గరికి రావాలి గానీ ఇలా మీరుమీరు గొడవపడడం ఏమిటని క్లాస్ పీకారు. ఇలా చేస్తే మీరే నష్టపోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. చంద్రబాబు సీరియస్ అవడంతో ఇద్దరూ నేతలు సైలెంట్ అయిపోయారు.

Tags:    
Advertisement

Similar News