అణగారిన వర్గాల భాగ్య విధాత

నెదర్లాండ్స్ కు చెందిన జాప్ స్టాక్ మాన్ ప్రపంచంలోనే అత్యంత పేరెన్నిక కన్న హాకీ గోల్ కీపర్. కాని మన దేశంలో అనేక మంది అణగారిన వర్గాల పిల్లల దృష్టిలో ఆయన పెద్ద హీరో.  వారి కలలను ఆయన సాకారం చేశారు. గత మూడేళ్లుగా హాకీ ఆడుతూ మన దేశంలో హీకీ ఆడుతున్న సందర్భంగా పిల్లలు తమకు అందిన ఉపకరణాలతో హాకీ ఆడడం గమనించి వారి కోసం 7000 హాకీ బాట్లు, బంతులు వగైరా పంపించారు. క్రీడాకారులు […]

Advertisement
Update: 2015-12-11 05:49 GMT

నెదర్లాండ్స్ కు చెందిన జాప్ స్టాక్ మాన్ ప్రపంచంలోనే అత్యంత పేరెన్నిక కన్న హాకీ గోల్ కీపర్. కాని మన దేశంలో అనేక మంది అణగారిన వర్గాల పిల్లల దృష్టిలో ఆయన పెద్ద హీరో. వారి కలలను ఆయన సాకారం చేశారు.

గత మూడేళ్లుగా హాకీ ఆడుతూ మన దేశంలో హీకీ ఆడుతున్న సందర్భంగా పిల్లలు తమకు అందిన ఉపకరణాలతో హాకీ ఆడడం గమనించి వారి కోసం 7000 హాకీ బాట్లు, బంతులు వగైరా పంపించారు. క్రీడాకారులు తాము ఉపయోగించే బాట్లు, బంతులు బాగానే ఉన్నా కొత్తవి కొంటుంటారు. పాత వాటిని సేకరించి స్టాక్ మాన్ భారత్ పంపించారు. దీని కోసం ఆయన “చక్ దే ఇండియా” అనే సంస్థను నెలకొల్పారు.

స్టాక్ మాన్ జేపీ పంజాబ్ వారియర్స్ తరఫున మన దేశంలో హాకీ ఆడేవారు. పిల్లలకు హాకీ ఉపకరణాలు అందించడం గురించి భారత హాకీ కోచ్ జగ్బీర్ సింగ్ తో చర్చించి ఉపకరణాలు సేకరించి పంపారు.

రెండు నెలల కాలంలో ఒక కంటేనర్ కు సరిపడా గోల్ కీపింగ్ కిట్లు, షర్టులు, హాకీ కిట్లు సేకరించగలిగానని స్టాక్ మాన్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తానంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News