హిందూపురం క్యాడర్‌ హడల్‌... రాజీనామాలు

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ దెబ్బకు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు షేక్‌ అయిపోతున్నాయి. శేఖర్ దెబ్బకు టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్‌ రంగారెడ్డి తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. శేఖర్ టార్చర్‌ను భరించలేకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. శేఖర్‌ తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. హిందూపురం రాజకీయాల్లో బాలయ్య గురించి కన్నా శేఖర్‌ గురించే ఎక్కువగా చర్చించుకుంటుంటారు. కొందరు  శేఖర్‌ తీరును సహించలేక కరపత్రాలు […]

Advertisement
Update: 2015-12-08 00:55 GMT

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ దెబ్బకు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు షేక్‌ అయిపోతున్నాయి. శేఖర్ దెబ్బకు టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. చిలమత్తూరు మండల టీడీపీ కన్వీనర్‌ రంగారెడ్డి తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. శేఖర్ టార్చర్‌ను భరించలేకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. శేఖర్‌ తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. హిందూపురం రాజకీయాల్లో బాలయ్య గురించి కన్నా శేఖర్‌ గురించే ఎక్కువగా చర్చించుకుంటుంటారు. కొందరు శేఖర్‌ తీరును సహించలేక కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. తాజాగా మండల కన్వీనర్‌ కూడా రాజీనామా చేయడం పరిస్థితి ముదిరిపాకానపడింది.

Click to Read: “థ్యాంక్స్‌” చెప్పినందుకు బదిలీ చేయించిన బాలయ్య పీఏ

బాలయ్య పీఏ వల్ల నియోజకవర్గంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఏ పని చేయాలన్న పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా పీఏ శేఖర్ డబ్బులు వసూలు చేస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చిలమత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో బాలకృష్ణ పీఏ శేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సమావేశంలో టీడీపీ రైతు సంఘం నాయకుడు బ్రహ్మానందరెడ్డి బహిరంగంగా ఆరోపణ చేశారు. ఈ సమయంలో మరో వర్గం వారు ఆయనపై దాడి చేశారు. పీఏ శేఖరే ఈ దాడి చేయించారని అప్పట్లో బ్రహ్మానందరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా చిలమత్తూరు మండల కన్వీనర్ రాజీనామా చేయగా… మరికొందరు కూడా అదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.

Click to Read: Bala Krishna gives warning to his colleague?

Tags:    
Advertisement

Similar News