మాకూ కేసీఆర్‌ కావాలిః జేసీ

సంచలన వ్యాఖ్యల స్పెషలిస్ట్‌ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఉద్యమంపై మాట్లాడుతూ … రాజకీయ నిరుద్యోగులే అవసరాన్ని బట్టి ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. తనకు ఎమ్మెల్యే ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యమంలో పాల్గొనబోనని నిజాయితీగా చెప్పారు. రాయలసీమ ఉద్యమం రాజకీయ నిరుద్యోగుల ఉద్యమంలా కాకుండా సీరియస్‌గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారాయన. ప్రస్తుతం అలాంటి వ్యక్తులు రాయలసీమ ఉద్యమంలో లేరని చెప్పారు. రాయలసీమకూ కేసీఆర్‌లాంటి వ్యక్తి అవసరం ఉందని […]

Advertisement
Update: 2015-12-06 00:08 GMT

సంచలన వ్యాఖ్యల స్పెషలిస్ట్‌ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ఉద్యమంపై మాట్లాడుతూ … రాజకీయ నిరుద్యోగులే అవసరాన్ని బట్టి ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. తనకు ఎమ్మెల్యే ఉద్యోగం ఉంది కాబట్టి ఉద్యమంలో పాల్గొనబోనని నిజాయితీగా చెప్పారు. రాయలసీమ ఉద్యమం రాజకీయ నిరుద్యోగుల ఉద్యమంలా కాకుండా సీరియస్‌గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారాయన. ప్రస్తుతం అలాంటి వ్యక్తులు రాయలసీమ ఉద్యమంలో లేరని చెప్పారు. రాయలసీమకూ కేసీఆర్‌లాంటి వ్యక్తి అవసరం ఉందని ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అప్పుడే ఉద్యమం ముందుకెళ్తుందన్నారు.

Tags:    
Advertisement

Similar News