మరో 8 వేల ఎకరాలకు ఎసరు పెడుతున్న ఏపీ ప్రభుత్వం

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కోసం భారీగా భూమి తీసుకున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్‌ రోడ్డు పేరుతో మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌ తంతుకు ప్రభుత్వం తెరలేపుతోంది. రింగ్ రోడ్డు కోసం మరో 8000 ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అధికారులకు చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 20 వేల కోట్లతో 150 మీటర్ల వెడల్పుతో […]

Advertisement
Update: 2015-12-04 04:48 GMT

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కోసం భారీగా భూమి తీసుకున్నారని అందరూ గగ్గోలు పెడుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్‌ రోడ్డు పేరుతో మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌ తంతుకు ప్రభుత్వం తెరలేపుతోంది. రింగ్ రోడ్డు కోసం మరో 8000 ఎకరాలు రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అధికారులకు చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 20 వేల కోట్లతో 150 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు 7800 ఎకరాలు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం ఇప్పటికే తీసుకున్న భూమి కాకుండా మరో ఎనిమిది వేల ఎకరాలు సమీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో ఎక్కువ భూమి మూడు పంటలు పండేదే. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం 30 వేల ఎకరాలు సమీకరించారు. దేవాలయ, అసైన్డ్‌ భూములు మరో 12 వేల ఎకరాలకు పైగా తీసుకున్నారు. ఇప్పుడు రింగ్ రోడ్డు కోసం మరోసారి పూలింగ్‌కు సిద్ధమవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News