చంద్రబాబుతో షటప్‌ అనిపించుకున్న ఆ నేతలెవరు?

పరిపాలనలో లోటుపాట్లను వివరించి మార్కులు కొట్టేద్దామనుకున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు చంద్రబాబు నుంచి ఊహించని షాక్ తగిలింది. వీరిలో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు.  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు తూర్పుగోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇటీవల విజయవాడ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. ఏంటి సంగతులు, జనం ఏమనుకుంటున్నారని చంద్రబాబు అడగ్గానే… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి రెచ్చిపోయారట. అధికారుల పనితీరు ఏమి బాగోలేదని, ఎవరూ సహకరించడం లేదని, క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని, ఇలా […]

Advertisement
Update: 2015-11-29 19:03 GMT

పరిపాలనలో లోటుపాట్లను వివరించి మార్కులు కొట్టేద్దామనుకున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలకు చంద్రబాబు నుంచి ఊహించని షాక్ తగిలింది. వీరిలో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు తూర్పుగోదావరి జిల్లా డెల్టా ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇటీవల విజయవాడ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. ఏంటి సంగతులు, జనం ఏమనుకుంటున్నారని చంద్రబాబు అడగ్గానే… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి రెచ్చిపోయారట. అధికారుల పనితీరు ఏమి బాగోలేదని, ఎవరూ సహకరించడం లేదని, క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉందని, ఇలా అయితే కష్టమంటూ ఆగకుండా నెగిటివ్ అంశాలను లేవనెత్తారు.

Click to Read: దేవీపై అల్లు గుర్రు

మాట్లాడినంత సేపు పాలన మొత్తం బాగోలేదన్నట్టుగానే సదరు నేతలు మాట్లాడారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఒక్కసారి ఫైర్ అయ్యారట. ప్రజాప్రతినిధి ఇంకా మాట్లాడుతుండగానే ”షటప్” అంటూ గట్టిగా అరిచినట్టు చెబుతున్నారు. ”మీ సంగతి నాకు తెలుసు. మీ జాతకాలన్నీ నా వద్ద ఉన్నాయ్. నా ముందే పాలనపై నెగటివ్‌గా మాట్లాడుతావా, నీ వల్ల జిల్లాలో పార్టీకి రావాల్సినంత చెడ్డపేరు వస్తోంది” అని మండిపడ్డారు. ”జిల్లాలో మీ అరాచకాలన్నీ నాకు తెలుసు. నా ముందే ఇష్టానుసారం మాట్లాడుతారా .. ముందు బయటకు వెళ్లండి” అని చంద్రబాబు రగిలిపోయారని చెబుతున్నారు. సీఎం దెబ్బకు చెమటలు పట్టిన ఇద్దరు నేతలు వెంటనే బయటకు వచ్చేశారు.

పాలనలో లోపాలను ఎత్తిచూపితే మంచి మార్కులు పడుతాయనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఇద్దరు నేతలు ఫీలయ్యారు. ఈ విషయాన్ని సన్నిహితులకు చెప్పుకుని వాపోయారు. అయితే సీఎంకు వద్దకు వెళ్లిన సదరు ఎమ్మెల్యే ఇటీవల చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల్లో టాప్‌ ప్లేస్ సాధించారు. కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిని వెంటపెట్టుకుని వెళ్లడం వల్లే ఆయనతో పాటు తాను తిట్లు తినాల్సి వచ్చిందని వాపోయారు.

Click to Read: 15-year-old gang-raped, aunt received video on WhatsApp

Tags:    
Advertisement

Similar News