బాబు వాడేది.. వైట్ పేపర్, న్యూస్ పేపర్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుస పెట్టి వైట్‌పేపర్లు (శ్వేతపత్రాలు) విడుదల చేస్తుండడాన్ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఇలా వైట్ పేపర్లు విడుదల చేస్తున్నారని విమర్శించారు. అసలు పాలనలో అక్రమాలు జరగకపోయి ఉంటే శ్వేత పత్రాలు విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇసుక వ్యవహారంలో దోపిడీ జరగలేదని ప్రకటించే ధైర్యం సీఎంకు ఉందా అని నిలదీశారు. ఒకప్పుడు ముంబాయిలో మాత్రమే వినిపించే మాఫియా పదం చంద్రబాబు పుణ్యమాని ఏపీ పల్లెటూర్లలోనూ వినిపిస్తోందని […]

Advertisement
Update: 2015-11-27 10:05 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరుస పెట్టి వైట్‌పేపర్లు (శ్వేతపత్రాలు) విడుదల చేస్తుండడాన్ని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఇలా వైట్ పేపర్లు విడుదల చేస్తున్నారని విమర్శించారు. అసలు పాలనలో అక్రమాలు జరగకపోయి ఉంటే శ్వేత పత్రాలు విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఇసుక వ్యవహారంలో దోపిడీ జరగలేదని ప్రకటించే ధైర్యం సీఎంకు ఉందా అని నిలదీశారు. ఒకప్పుడు ముంబాయిలో మాత్రమే వినిపించే మాఫియా పదం చంద్రబాబు పుణ్యమాని ఏపీ పల్లెటూర్లలోనూ వినిపిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తన తప్పులను, అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు న్యూస్‌ పేపర్లు, వైట్‌ పేపర్లను వాడు కుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News