టీడీపీతో పొత్తుపెట్టుకుంటాం

వరంగల్‌ ఉపఎన్నికలో  ఘోర పరాజయం ఎదురవడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఫలితాలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలంటే విపక్షాలన్నీ ఏకం కావాల్సిందేనని చెప్పారు. 2019నాటికి టీడీపీతో కూడా పొత్తుపెట్టుకునేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలకాలంటే టీడీపీతో కూడా కలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అందుకు బీజేపీని టీడీపీ వదిలేయాల్సి ఉంటుందన్నారు. కావాలంటే ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. […]

Advertisement
Update: 2015-11-24 00:52 GMT

వరంగల్‌ ఉపఎన్నికలో ఘోర పరాజయం ఎదురవడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. ఫలితాలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టాలంటే విపక్షాలన్నీ ఏకం కావాల్సిందేనని చెప్పారు. 2019నాటికి టీడీపీతో కూడా పొత్తుపెట్టుకునేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలకాలంటే టీడీపీతో కూడా కలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అందుకు బీజేపీని టీడీపీ వదిలేయాల్సి ఉంటుందన్నారు. కావాలంటే ఏపీలో టీడీపీ, బీజేపీ పొత్తు కొనసాగినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

Click to Read: AP CS’s comment leave Government employees squirming

Tags:    
Advertisement

Similar News