చంద్రబాబు రహస్యాలు!

తన పాలనలో అంతా పారదర్శకంగానే జరుగుతుందని పదేపదే చెప్పే సీఎం చంద్రబాబు … చేతల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా దాస్తున్నారు. గడిచిన 18 నెలల కాలంలో ఏకంగా 800 జీవోలను రహస్య జీవోలుగా జారీ చేశారు. అంటే వీటిని ఆన్‌లైన్‌లో ప్రజలు చూసే వీలుండదు. పూర్తిగా రహస్యమన్న మాట. ఇప్పటి వరకు జారీ చేసిన మొత్తం జీవోల్లో వీటి సంఖ్య 20 శాతం. ఈ 800 జీవోల్లో చంద్రబాబు […]

Advertisement
Update: 2015-11-22 05:33 GMT

తన పాలనలో అంతా పారదర్శకంగానే జరుగుతుందని పదేపదే చెప్పే సీఎం చంద్రబాబు … చేతల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా దాస్తున్నారు. గడిచిన 18 నెలల కాలంలో ఏకంగా 800 జీవోలను రహస్య జీవోలుగా జారీ చేశారు. అంటే వీటిని ఆన్‌లైన్‌లో ప్రజలు చూసే వీలుండదు. పూర్తిగా రహస్యమన్న మాట. ఇప్పటి వరకు జారీ చేసిన మొత్తం జీవోల్లో వీటి సంఖ్య 20 శాతం.

ఈ 800 జీవోల్లో చంద్రబాబు ఆధీనంలో ఉన్న శాఖలకు సంబంధించినవే 552 జీవోలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో రెవెన్యూ శాఖ నుంచి 104, హోంశాఖ నుంచి 86, ఆర్థిక శాఖ నుంచి 28 జీవోలు రహస్యంగా జారీ చేశారు. వీటిలో భూముల కేటాయింపుకు సంబంధించిన జీవోలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఎవరికి ఎంత భూమి కేటాయిస్తోందన్న విషయం రహస్యమన్నమాట. చంద్రబాబు విదేశీ ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, విమానాల చార్జీలకు సంబంధించిన జీవోలను కూడా రహస్య కేటగిరిలోనే ఉంచారు.

భూకేటాయింపుల విషయాలు ముందే బయటకు తెలిస్తే రచ్చరచ్చ అవుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా రహస్య పాలన చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం కొందరు పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రం నుంచి తరలివచ్చే ఉద్దేశంతో ఉన్నారని… అయితే ప్రక్రియ మొత్తం ముగిసే వరకు వివరాలను బయటపెట్టవద్దని వారు కోరారట. అందుకే రహస్య జీవోలను విడుదల చేస్తున్నామని చెబుతోంది. మరి చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చులు, ప్రత్యేక విమానాల చెల్లించిన సొమ్ము, సీఎం చాంబర్ల ఆధనీకరణ వంటి వాటికి పెట్టిన ఖర్చు వివరాలను ఎందుకు దాస్తున్నారన్న దానికి మాత్రం సమాధానం రావడం లేదు.

ప్రతి ప్రభుత్వంలోనూ రహస్య జీవోల జారీ సాధారణమే అయినా మరీ ఈ స్థాయిలో 18 నెలల కాలంలోనే 800 జీవోలు విడుదల చేయడం విపరీత పరిణామం అని సీనియర్ అధికారులు అంటున్నారు. ఈ స్థాయిలో ప్రభుత్వం రహస్యపాలన సాగిస్తున్నా ఏపీలోని మీడియా ఎందుకు ఈ విషయాన్ని ప్రముఖంగా చూపడం లేదని అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News