పవన్‌ కల్యాణ్‌పై తెలకపల్లి రవి విసుర్లు

ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానని చెప్పిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎవరిని ప్రశ్నిస్తున్నాడో… ఏమని ప్రశ్నిస్తున్నాడో అర్ధం కావడం లేదని తెలంగాణ సాహితీ సమితి అధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలనే తాను కూడా చెబుతూ తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఆయన మారిపోయాడని విమర్శించారు. కనీసం ప్రత్యేక హోదా కోసం కూడా ప్రశ్నించక పోవడం అన్యాయమని, ఇది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ విస్తరణకు తన వద్ద డబ్బు […]

Advertisement
Update: 2015-11-15 11:58 GMT

ప్రశ్నించడానికే పార్టీ పెడుతున్నానని చెప్పిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎవరిని ప్రశ్నిస్తున్నాడో… ఏమని ప్రశ్నిస్తున్నాడో అర్ధం కావడం లేదని తెలంగాణ సాహితీ సమితి అధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలనే తాను కూడా చెబుతూ తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఆయన మారిపోయాడని విమర్శించారు. కనీసం ప్రత్యేక హోదా కోసం కూడా ప్రశ్నించక పోవడం అన్యాయమని, ఇది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ విస్తరణకు తన వద్ద డబ్బు లేదని అనడం సబబు కాదని, అంటే డబ్బుతోనే రాజకీయాలను నడపాలనే ధోరణే ఆయనలో కూడా కనిపిస్తోందని తెలకపల్లి అన్నారు. ‘చూడు సిద్దప్పా… నీకు రాజకీయాల్లోకి రావాలని ఉంటే వచ్చి రాజకీయం చేయ్యి. లేకపోతే సినిమాలకు పరిమితమై సినిమాలు చేసుకో’ అంటూ వ్యంగ్యంగా పవన్‌ను ఉద్దేశించి తెలకపల్లి వ్యాఖ్యానించారు. సినిమాలా? రాజకీయమా… ఏదో ఒకటి తేల్చుకుని ప్రజలు తనను ప్రశ్నించకుండా చేసుకోవాలని హితవు చెప్పారు. ఇక చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ ఆయన పాలనంతా అమరావతి చుట్టూ పరిభ్రమిస్తోందని, మిగిలిన రాష్ట్రం ఏమైనా సంబంధం లేనట్టు ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News