క్యాన్సర్ నిర్దారణకు ఇక ఒక్క రక్తపు బొట్టు చాలు
క్యాన్సర్ ఉందా…అనే విషయాన్ని నిర్దారించేందుకు చేసే పరీక్షలను మరింత సులభతరం అయ్యేలా చేశారు వైద్య పరిశోధకులు. ఇకపై ఒక్క రక్తపు బొట్టు పరీక్షతో ఈ విషయం తేలనున్నది. వ్యక్తి నుండి ఒక నీటిబొట్టు పరిమాణంలో రక్తాన్ని సేకరించి దానికి బయాప్సీని నిర్వహించడం ద్వారా క్యాన్సర్ నిర్దారణ సాధ్యమేనని ఒక నూతన అధ్యయనం చెబుతోంది. ఈ సరికొత్త పద్ధతిలో రక్తం ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తారు. రక్తంలో ప్లేట్లెట్స్కి ఆర్ ఎన్ ఎ (అనువంశిక కణాల్లో ఉండే ప్రొటీను) పరీక్షలు […]
క్యాన్సర్ ఉందా…అనే విషయాన్ని నిర్దారించేందుకు చేసే పరీక్షలను మరింత సులభతరం అయ్యేలా చేశారు వైద్య పరిశోధకులు. ఇకపై ఒక్క రక్తపు బొట్టు పరీక్షతో ఈ విషయం తేలనున్నది. వ్యక్తి నుండి ఒక నీటిబొట్టు పరిమాణంలో రక్తాన్ని సేకరించి దానికి బయాప్సీని నిర్వహించడం ద్వారా క్యాన్సర్ నిర్దారణ సాధ్యమేనని ఒక నూతన అధ్యయనం చెబుతోంది. ఈ సరికొత్త పద్ధతిలో రక్తం ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తారు. రక్తంలో ప్లేట్లెట్స్కి ఆర్ ఎన్ ఎ (అనువంశిక కణాల్లో ఉండే ప్రొటీను) పరీక్షలు చేయడం ద్వారా 96 శాతం ఖచ్ఛితత్వంతో క్యాన్సర్ నిర్దారణ చేయవచ్చని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి కణజాల పరీక్షను నివారించే అవకాశం ఉందని ఈ అధ్యయన నిర్వాహకుల్లో ఒకరైన జొనాస్ నిల్సాన్ అంటున్నారు. ఈయన స్వీడన్‌లోని ఉమియా యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. దాదాపు అన్ని రకాల క్యాన్సర్లు రక్తపు పరీక్షలో బయటపడ్డాయని, ఇది క్యాన్సర్ నిర్దారణకు చక్కని పద్ధతిగా ఉపయోగపడుతుందని నిల్సాన్ తెలిపారు. రక్తపు ప్లేట్లెట్స్లో వ్యాధి నిర్దారణను సులువు చేసే అంశాలున్నాయని, వ్యాధిని కనుగొనేందుకే కాక, చికిత్సా పద్ధతులను నిర్ణయించుకునేందుకు కూడా రక్త పరీక్ష ఉపకరిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అధ్యయనం కోసం 283మంది రక్తపు నమూనాలను పరీక్ష చేయగా అందులో 228మందిలో ఏదోఒకరూపంలో క్యాన్సర్ ఉందని తేలింది. 55మందిలో క్యాన్సర్ జాడ ఏమాత్రం లేదని తేలింది.
రక్త నమూనాలకు ఆర్ ఎన్ ఎ (అనువంశిక కణాల్లో ఉండే ప్రొటీను) పరీక్షలు నిర్వహించి, 96శాతం ఖచ్ఛితత్వంతో క్యాన్సర్ నిర్దారణ చేసినట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. బ్లడ్ టెస్ట్ కి కొనసాగింపుగా చేసిన పరీక్షల్లో పరిశోధకులు, ట్యూమర్ ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని 71శాతం ఖచ్ఛితత్వంతో కనుగొన్నారు. లంగ్స్, బ్రెస్ట్, బ్రెయిన్, కొలోన్, రెక్టమ్, పాంక్రియాస్, లివర్ల్లో క్యాన్సర్ మొదలైనట్టుగా గుర్తించారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టడంలో ఈ తేలికపాటి నిర్దారణ పరీక్ష తోడ్పడుతుందని ఆశిద్దాం.