బాబును ఇబ్బంది పెట్టని పవన్... ఏమన్నారంటే!

రాజధాని భూసేకరణ, ఇతర సమస్యలపై చంద్రబాబుతో చర్చించేందుకు సమావేశమైన పవన్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు.  అయితే ఎక్కడా కూడా ఆయన చంద్రబాబుకు గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కట్టి విరగకుండా పాము చావకుండా మాట్లాడారు. అమరావతి శంకుస్థాపనకు హాజరు కాలేకపోయానని అందుకే సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానన్నారు. రాజధాని భూసేకరణపై చర్చించానని…  బలవంతంగా లాక్కునేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా లేరన్నారు. భూసేకరణచట్టాన్ని ప్రయోగిస్తామని మంత్రి ప్రత్తిపాటి చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా […]

Advertisement
Update: 2015-11-12 05:37 GMT

రాజధాని భూసేకరణ, ఇతర సమస్యలపై చంద్రబాబుతో చర్చించేందుకు సమావేశమైన పవన్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే ఎక్కడా కూడా ఆయన చంద్రబాబుకు గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. కట్టి విరగకుండా పాము చావకుండా మాట్లాడారు. అమరావతి శంకుస్థాపనకు హాజరు కాలేకపోయానని అందుకే సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానన్నారు.

రాజధాని భూసేకరణపై చర్చించానని… బలవంతంగా లాక్కునేందుకు చంద్రబాబు కూడా సిద్ధంగా లేరన్నారు. భూసేకరణచట్టాన్ని ప్రయోగిస్తామని మంత్రి ప్రత్తిపాటి చెప్పిన విషయాన్ని గుర్తు చేయగా మెజారిటీ రైతులు భూములిచ్చారు కాబట్టి… మిగిలిన వారిని కూడా ఒప్పించి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బలవంతంగా ఎవరి వద్ద భూములు తీసుకోబోమని చంద్రబాబు చెప్పారన్నారు.

బాక్సైట్‌ తవ్వకాల గురించి చర్చించామని… అయితే బాక్సైట్ వ్యవహారం ఇప్పుడు వచ్చింది కాదన్నారు. వైఎస్‌ హయాంలోనే బాక్సైట్‌ వివాదం వచ్చిందన్నారు. గిరిజనుల అనుమతితోనే బాక్సైట్ తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదాపై మోదీ ప్రకటన తర్వాతే తాను స్పందిస్తానన్నారు. ధర్నాలు, బంద్‌లు చేయడం వల్ల కేంద్రం స్పందించదని పవన్ తేల్చేశారు. ఒక వేళ కేంద్రం ఏపీకి సాయం చేయం అంటే అప్పుడు తన రియాక్షన్ వేరేలా ఉంటుందన్నారు.

బాధ్యత తీసుకుని ఢిల్లీ వెళ్లి పోరాటం చేసేందుకు తనది ఎమ్మెల్యే కన్నా తక్కువ హోదా అని జనసేన అధినేత చెప్పారు. తాను ప్రస్తావించిన అంశాలపై చంద్రబాబు స్పందన ఆశాజనకంగా ఉందని పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద చంద్రబాబుతో పవన్ భేటీ వల్ల కీలక పరిణామాలుంటాయకుంటే అవేమీ జరగలేదు.

Tags:    
Advertisement

Similar News