ఇప్పుడు డబ్బుల్లేవు... 2019లో వస్తా: పవన్

విజయవాడలో సీఎం  చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ తన జనసేన పార్టీపైనా క్లారిటీ ఇచ్చారు. పార్టీని పూర్తిస్థాయిలో ఎప్పుడు విస్తరిస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… తన దగ్గర అంత డబ్బు లేదన్నారు. పార్టీని విస్తరించాలంటే ప్రజాభిమానం ఒక్కటే సరిపోదన్నారు. ఇప్పటికిప్పుడు పార్టీని విస్తరించేందుకు అవసరమైన ఆర్ధిక వనరులు తన దగ్గరలేవన్నారు. తాను పూర్తి స్థాయిలో సమయం కేటాయించే పరిస్థితి వచ్చినప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తానన్నారు.  పార్టీ కోసం చాలా మంది ఉన్నారని వారందరితో […]

Advertisement
Update: 2015-11-12 04:08 GMT

విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ తన జనసేన పార్టీపైనా క్లారిటీ ఇచ్చారు. పార్టీని పూర్తిస్థాయిలో ఎప్పుడు విస్తరిస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… తన దగ్గర అంత డబ్బు లేదన్నారు. పార్టీని విస్తరించాలంటే ప్రజాభిమానం ఒక్కటే సరిపోదన్నారు. ఇప్పటికిప్పుడు పార్టీని విస్తరించేందుకు అవసరమైన ఆర్ధిక వనరులు తన దగ్గరలేవన్నారు.

తాను పూర్తి స్థాయిలో సమయం కేటాయించే పరిస్థితి వచ్చినప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తానన్నారు. పార్టీ కోసం చాలా మంది ఉన్నారని వారందరితో చర్చిస్తానన్నారు. 2019 నాటికి మాత్రం తప్పకుండా వస్తానన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న దానిపై స్పందించలేదు. వరంగల్ ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్తారా అని ప్రశ్నించగా అంత దూరం తాను ఆలోచించలేదన్నారు పవన్.

Also Read: 2019 ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌కల్యాణ్‌

Tags:    
Advertisement

Similar News