నేడు చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్‌ కోరారు. అనేక సమస్యలు ముసురుకున్న సమయంలో పవన్‌ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి సమావేశంలో కీలకమైన అనేక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాజధాని భూ సేకరణ, రైతుల సమస్యలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. మరో ముఖ్య అంశం… గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు. రాజకీయ పార్టీగా నమోదయిన నేపథ్యంలో జనసేన పార్టీ […]

Advertisement
Update: 2015-11-11 02:19 GMT

జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్‌ కోరారు. అనేక సమస్యలు ముసురుకున్న సమయంలో పవన్‌ మీటింగ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి సమావేశంలో కీలకమైన అనేక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాజధాని భూ సేకరణ, రైతుల సమస్యలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. మరో ముఖ్య అంశం… గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు. రాజకీయ పార్టీగా నమోదయిన నేపథ్యంలో జనసేన పార్టీ విడిగా పోటీ చేయాలా లేక బీజేపీ-టీడీపీతో కలిసి పోటీ చేయాలా అన్న విషయం కూడా వీరి మధ్య చర్చ జరగవచ్చు. పవన్‌ కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ కోరారని, గురువారం మధ్యాహ్నం విజయవాడలో చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సీఎంఓ కార్యాలయం ధ్రువీకరించింది.

Tags:    
Advertisement

Similar News