ఇది బీజేపీ నిజంగా సిగ్గు పడాల్సిన విషయమే

ఢిల్లీలో ఘోర పరాజయాన్ని చవిచూసినట్టే బీహార్‌లో కూడా భారతీయ జనతాపార్టీ ఓటమి పాలయ్యింది. ఇది కేంద్రంలో అధికారం ఉన్న ఎన్డీయే కూటమి జీర్ణించుకోవలసిన పరిస్థితి కల్పించింది. కాని ఇక్కడే అందరూ ఖంగు తినే మరో నిజం దాగి ఉంది. ఆ విషయాన్ని మాత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎవరైతే స్టార్‌ క్యాంపైనర్‌ అనుకుంటున్నారో ఆయన ప్రచారం చేసిన చోటే బీజేపీకి ఎదురుగాలి వీచింది. స్టార్‌ క్యాంపైనర్‌ ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఎన్డీయేకి ముఖ్యంగా […]

Advertisement
Update: 2015-11-10 08:41 GMT

ఢిల్లీలో ఘోర పరాజయాన్ని చవిచూసినట్టే బీహార్‌లో కూడా భారతీయ జనతాపార్టీ ఓటమి పాలయ్యింది. ఇది కేంద్రంలో అధికారం ఉన్న ఎన్డీయే కూటమి జీర్ణించుకోవలసిన పరిస్థితి కల్పించింది. కాని ఇక్కడే అందరూ ఖంగు తినే మరో నిజం దాగి ఉంది. ఆ విషయాన్ని మాత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎవరైతే స్టార్‌ క్యాంపైనర్‌ అనుకుంటున్నారో ఆయన ప్రచారం చేసిన చోటే బీజేపీకి ఎదురుగాలి వీచింది. స్టార్‌ క్యాంపైనర్‌ ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఎన్డీయేకి ముఖ్యంగా బీజేపీకి ఇప్పటివరకు అన్నీ తానై నడిపిస్తున్న నరేంద్రమోదీ బీహార్‌ ఎన్నికల్లో నెల రోజుల వ్యవధిలో 26 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఇందులో 10 నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు. కనీసం ఈ స్టార్‌ క్యాంపైనర్‌ ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాల్లో గెలిచినా మరో పది స్థానాలు దక్కేవి. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ప్రచారం చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ప్రకటనకు ముందే నాలుగు బహిరంగసభలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీకి జనం నీరాజనాలు పలికారు. అయితే వీరిని ఓట్ల రూపంలో మార్చుకోలేక పోవడంతో బీజేపీకి ఉన్న సత్తా బయటపడింది. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఉంది. అదే కాంగ్రెస్‌ ప్రచారం… గెలిచిన స్థానాలు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రచారం చేసినవి కేవలం నాలుగే నాలుగు అసెంబ్లీ స్థానాలు. నాలుగింటిలో కూడా కాంగ్రెస్‌ విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో నాలుగు తప్ప మిగిలిన 8 స్థానాల్లో పార్టీ గెలుపు కైవసం చేసుకుంది. ఈ లెక్కన చూసినా స్టార్‌ క్యాంపైనర్‌ నరేంద్ర మోదీ కన్నా వీరిద్దరి ఖాతాలోనే బీహార్‌ ప్రజల ఓట్లు పడ్డాయన్న మాట. ఇది ఎన్డీయే పక్షాలతోపాటు బీజేపీని కూడా తల ఎత్తుకోలేని పరిస్థితిని కల్పించింది. పైకి గంభీరంగా కనిపించే నేతలకు లోపల ఈ గుబులు వెంటాడుతోంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఎన్డీయే కూటమిని మరింత దిగజారుస్తుందని నేతలు కలవర పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News