అటవీ ప్రాంతంలో చింతమనేని దుశ్చర్య!

చింతమనేనితో సహా 60 మందిపై డిఎఫ్‌వో ఫిర్యాదు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో చట్ట విరుద్ద చర్యకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇసుకు మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా అటవీ శాఖకు సంబంధించిన వివాదంలో ఇరుక్కున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ భూముల్లో అర్ధరాత్రి రహస్యంగా కొంతమంది నాయకులను, కార్మికులను పురమాయించి రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అటవీ అధికారులు అడ్డు పడుతున్నారనే కారణంతో కొంతమంది నాయకులు చడీచప్పుడు కాకుండా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. […]

Advertisement
Update: 2015-11-06 23:01 GMT

చింతమనేనితో సహా 60 మందిపై డిఎఫ్‌వో ఫిర్యాదు
ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరో చట్ట విరుద్ద చర్యకు పాల్పడ్డారు. ఇప్పటికే ఇసుకు మాఫియాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తాజాగా అటవీ శాఖకు సంబంధించిన వివాదంలో ఇరుక్కున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ భూముల్లో అర్ధరాత్రి రహస్యంగా కొంతమంది నాయకులను, కార్మికులను పురమాయించి రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అటవీ అధికారులు అడ్డు పడుతున్నారనే కారణంతో కొంతమంది నాయకులు చడీచప్పుడు కాకుండా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కోమటివాని లంక వరకు అర్ధరాత్రి రోడ్డు నిర్మాణాన్ని జరిపించారు. ఇక్కడ రోడ్డు నిర్మించవద్దని, ఇది రక్షిత అటవీ ప్రాంత పరిధి అని అనేకసార్లు అటవీశాఖ అధికారులు చెప్పినప్పటికీ పెడ చెవిన పెట్టి తమకు ఎదురేముందన్నట్టు రోడ్డు నిర్మాణానికి పాల్పడ్డారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు డిఎఫ్‌వో దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో చింతమనేనితోపాటు 60 మందిని చేర్చారు.

Tags:    
Advertisement

Similar News