సౌదీ రాజు భార్యకు రూ.150 కోట్ల పరిహారం!

సౌదీ రాజు ఫాద్‌ 1968లో రహస్యంగా పెళ్లాడిన జనన్‌ హర్బ్‌ అనే మహిళకు ఇప్పుడు భారీ మొత్తంలో పరిహారం లభించనుంది. రాజు మరణించినపుడు తనకు పరిహారం చెల్లిస్తామని 2003లో అప్పటి యువ రాజు అబ్దుల్‌ అజీజ్‌ తనకు హామీ ఇచ్చారని, రాజు మరణించిన తరువాత తాను పరిహారం కోరుతున్నానని ఆమె బ్రిటన్‌ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు. జనన్‌ క్లయిమ్‌కు విశ్వసనీయమైన ఆధారాలున్నాయని నిర్ధారించిన న్యాయమూర్తి ఆమెకు 2.3 కోట్ల డాలర్లతోపాటు లండన్‌లో రెండు విలాస […]

Advertisement
Update: 2015-11-04 13:01 GMT

సౌదీ రాజు ఫాద్‌ 1968లో రహస్యంగా పెళ్లాడిన జనన్‌ హర్బ్‌ అనే మహిళకు ఇప్పుడు భారీ మొత్తంలో పరిహారం లభించనుంది. రాజు మరణించినపుడు తనకు పరిహారం చెల్లిస్తామని 2003లో అప్పటి యువ రాజు అబ్దుల్‌ అజీజ్‌ తనకు హామీ ఇచ్చారని, రాజు మరణించిన తరువాత తాను పరిహారం కోరుతున్నానని ఆమె బ్రిటన్‌ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో వివరించారు. జనన్‌ క్లయిమ్‌కు విశ్వసనీయమైన ఆధారాలున్నాయని నిర్ధారించిన న్యాయమూర్తి ఆమెకు 2.3 కోట్ల డాలర్లతోపాటు లండన్‌లో రెండు విలాస వంతమైన అపార్ట్‌మెంట్లను అందచేయాలని తీర్పునిచ్చారు. తాను క్రైస్తవమతానికి చెందిన మహిళ కావటంతో రాజకుటుంబం తమ వివాహాన్ని వ్యతిరేకించిందని, రాజును పెళ్లాడేందుకు తాను ఇస్లామ్‌ మతం స్వీకరించానని జనన్‌ కోర్టుకు వివరించింది.

Tags:    
Advertisement

Similar News