ఆంధ్రా వర్శిటీ హాస్టల్లో ర్యాగింగ్‌ కలకలం

ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ విభాగం విద్యార్థినుల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందిన ఫిర్యాదుపై ఆయన విచారణకు ఆదేశించారు. పార్కులకు..బయటకు రావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులను వేధిస్తున్నారని, దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఓ విద్యార్థి తల్లిదండ్రులు మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గంటా వెంటనే దీనిపై విచారణ జరపాల్సిందిగా రిజిష్ట్రార్‌కు […]

Advertisement
Update: 2015-11-02 19:01 GMT

ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ విభాగం విద్యార్థినుల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అందిన ఫిర్యాదుపై ఆయన విచారణకు ఆదేశించారు. పార్కులకు..బయటకు రావాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ జూనియర్ విద్యార్థులను వేధిస్తున్నారని, దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఓ విద్యార్థి తల్లిదండ్రులు మంత్రికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న గంటా వెంటనే దీనిపై విచారణ జరపాల్సిందిగా రిజిష్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన ఏయూ రిజిష్ట్రార్ ఉమా మహేశ్వరరావు ఏయూ ఇంజినీరింగ్ విభాగం వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై ఏయూ అధికారులతో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీక్షించనున్నారు.

Tags:    
Advertisement

Similar News