ప్రజల్ని ఫూల్‌ చేయడం మోదీకి బాగా తెలుసు: కట్జు

ప్రజలను ఫూల్‌ చేసే ప్రతిభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర దండిగా ఉందని, దాంతో ఆయన అందర్నీ మభ్య పెడుతూ పాలన సాగిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మన్‌ మార్కండేయ కట్జు పేర్కొన్నారు. బీహార్‌ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాభవం తప్పదని, మోడీ రాత వేగంగా మారిపోనుందని ఆయన వ్యాఖ్యానించారు. 2014 మేలో అధికారం చేపట్టిన నాటి నుండే మోదీ ప్రజాదరణ తిరోగమనం పట్టిందన్నారు. బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి […]

Advertisement
Update: 2015-11-01 01:02 GMT

ప్రజలను ఫూల్‌ చేసే ప్రతిభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర దండిగా ఉందని, దాంతో ఆయన అందర్నీ మభ్య పెడుతూ పాలన సాగిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్‌ కౌన్సిల్‌ మాజీ ఛైర్మన్‌ మార్కండేయ కట్జు పేర్కొన్నారు. బీహార్‌ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాభవం తప్పదని, మోడీ రాత వేగంగా మారిపోనుందని ఆయన వ్యాఖ్యానించారు. 2014 మేలో అధికారం చేపట్టిన నాటి నుండే మోదీ ప్రజాదరణ తిరోగమనం పట్టిందన్నారు. బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని మహా కూటమి మూడింట రెండొంతుల మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని ఎన్నికల పండితులు చెబుతున్నట్లు నితీష్‌-లాలూ కూటమి కేవలం విజయం సాధించటం మాత్రమే కాదని, మూడింట రెండొంతుల మెజార్టీతో క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఆయన ఫేస్‌బుక్‌లో అభిప్రాయపడ్డారు. పప్పుల ధర రు.200 దాటడం, నిరుద్యోగిత పెరగటం వంటివాటితో ఇప్పటికే ప్రజాదరణ కోల్పోయారని, కేవలం అగ్రవర్ణ హిందువులు మాత్రమే ఆయన్ను సమర్ధిస్తున్నారని కట్జు వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News