అమరావతిపై బీబీసీ ప్రత్యేక కథనం

రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నడుపుతున్న వ్యవహారం జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రపంచంలోనే అతి ప్రముఖమైన బీబీసీ వార్త సంస్థ అమరావతిలో జరుగుతున్న వ్యవహారంపై ప్రత్యేక కథనాన్నిప్రచురించింది. అమరావతి వరమా విషమా అంటూ కథనాన్ని వెలువరించింది. రాజధానిపేరుతో ఏపీ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని బీబీసీ కథనాన్ని వెలువరించింది. సింగపూర్‌కు పది రెట్లు అధిక విస్తీర్ణంలో అమరావతి నిర్మాణం జరగబోతోందని వెల్లడించింది. రాజధాని భూముల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. రాజధాని ప్రాంతంలో రైతులెవరూ […]

Advertisement
Update: 2015-10-26 00:24 GMT

రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నడుపుతున్న వ్యవహారం జాతీయ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ప్రపంచంలోనే అతి ప్రముఖమైన బీబీసీ వార్త సంస్థ అమరావతిలో జరుగుతున్న వ్యవహారంపై ప్రత్యేక కథనాన్నిప్రచురించింది. అమరావతి వరమా విషమా అంటూ కథనాన్ని వెలువరించింది.

రాజధానిపేరుతో ఏపీ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని బీబీసీ కథనాన్ని వెలువరించింది. సింగపూర్‌కు పది రెట్లు అధిక విస్తీర్ణంలో అమరావతి నిర్మాణం జరగబోతోందని వెల్లడించింది. రాజధాని భూముల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. రాజధాని ప్రాంతంలో రైతులెవరూ గుమిగూడకుండా ఆంక్షలు విధించారని ప్రపంచానికి తెలియజేసింది. పోలీసులను ప్రయోగించి తమ భూములను ప్రభుత్వం లాక్కుందని పలువురు రైతులు చెప్పినట్టు వెల్లడించింది. చంద్రబాబు కేవలం వ్యాపారవేత్తలకు కొమ్ముకాస్తున్నారని రైతులు బీబీసీ దగ్గర వాపోయారు.

రాజధాని ప్రాంతంలో జరగనున్న ప్రకృతి విధ్వంసంపై వార్తా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే కొన్ని నెలల్లో రాజధాని పరిధిలో 10 మిలియన్లు అంటే కోటి చెట్లను నరికేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించిందని వెల్లడించింది. అమరావతిలో జరుగుతున్న తంతును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టిన అంశాన్ని కూడా ప్రస్తావించింది. రైతుల నుంచి సేకరించిన భూమే కాకుండా మరో 49 వేల 240 ఎకరాల అటవీభూమిని డీ నోటిఫై చేయాల్సిందిగా కేంద్రం ప్రభుత్వాన్ని కోరడాన్ని ప్రత్యేకంగా పేర్కొంది.

ఇలా ఫారెస్ట్ ల్యాండ్‌ను తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటిని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పింది. తీసుకున్న అటవీ భూమికి రెండింతలు వేస్ట్ ల్యాండ్‌ను అటవీ శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. నరికే ఒక్కో చెట్టు స్థానంలో మూడుమొక్కలు నాటాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఒక అటవీశాఖ అధికారి పేరుతో బీబీసీ వార్త సంస్థ వెల్లడించింది. అయితే అలాంటి అటవీ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కోటి చెట్లను నరికివేయడం అంటే అదో ప్రకృతి విపత్తేనని బీబీసీ కథనం చెబుతోంది. మొత్తం మీద అమరావతి ఖ్యాతిని బీబీసీ ఈ విధంగా ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది.

Tags:    
Advertisement

Similar News