నాదేండ్ల తనని అవమానించినట్లు భావించారా?

తెలుగుదేశం పార్టీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఝలక్‌ ఇచ్చారు. రాజధాని నగరం అమరావతి శంకుస్థాపనకు ఆయనకు ఆహ్వానం పలకడానికి వెళ్ళిన వారికి ఆయన ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో దిమ్మ తిరిగిపోయింది. అందరికీ ఆహ్వాన పత్రాలు ఇస్తున్నట్టే నాదెండ్లకు కూడా ఇవ్వాలని భావించారు. పంచాయతీ శాఖ మంత్రి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. నాదెండ్ల కూడా అందుకు అంగీకరించి రమ్మన్నారు. తీరా ఆహ్వానం తీసుకుని వెళ్ళినవారు మారిపోయారు. ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ మరో నాయకుడు మద్దిపట్ల సూర్యప్రకాష్‌ను తీసుకుని […]

Advertisement
Update: 2015-10-21 13:35 GMT

తెలుగుదేశం పార్టీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఝలక్‌ ఇచ్చారు. రాజధాని నగరం అమరావతి శంకుస్థాపనకు ఆయనకు ఆహ్వానం పలకడానికి వెళ్ళిన వారికి ఆయన ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో దిమ్మ తిరిగిపోయింది. అందరికీ ఆహ్వాన పత్రాలు ఇస్తున్నట్టే నాదెండ్లకు కూడా ఇవ్వాలని భావించారు. పంచాయతీ శాఖ మంత్రి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. నాదెండ్ల కూడా అందుకు అంగీకరించి రమ్మన్నారు. తీరా ఆహ్వానం తీసుకుని వెళ్ళినవారు మారిపోయారు. ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్‌ మరో నాయకుడు మద్దిపట్ల సూర్యప్రకాష్‌ను తీసుకుని నాదెండ్ల భాస్కరరావు ఇంటికి వెళ్ళారు. అపాయింట్‌మెంట్‌ మంత్రికి ఇస్తే వీళ్ళు రావడం ఏమిటి అనుకున్న నాదెండ్ల తాను ఇంటిలో ఉండి కూడా లేరనిపించారు. జనార్ధన్‌ నాదెండ్ల ఇంటికి వెళ్ళినపుడు ఆయన మేడపైనే ఉన్నారు. ఎవరు వచ్చారో ఆరా తీశారు. వచ్చినవారెవరో తెలుసుకున్న నాదెండ్ల మేడ మీద నుంచి కిందకు కూడా రాకుండా కింద ఉన్న గన్‌మెన్‌కి ఆహ్వాన పత్రం ఇచ్చి వెళ్ళమని చెప్పారట. దాంతో జనార్ధన్‌ చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. మాజీ ముఖ్యమంత్రినైన తనను పిలవ వలసిన తీరు ఇదేనా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇంకో విషయం ఏమిటంటే నాదెండ్ల భాస్కరరావు తనయుడు, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా అందుబాటులో లేరని చెప్పించారట.

Tags:    
Advertisement

Similar News