అమరావతిలో మురళీమోహన్‌ రియల్‌ఎస్టేట్‌కు అనుమతి

చంద్రబాబును అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలలో భారీగా భూములను సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన సినీ నటుడు, రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఇప్పుడు అందరి కంటే ముందుగానే అమరావతిలోనూ తన ”జయభేరి” జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు. రాజధాని ప్రాంతంలో లేఅవుట్లకు, నిర్మాణాలకు అనుమతులివ్వడం కుదరదని చెబుతున్న ప్రభుత్వం మురళీమోహన్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా లక్షా 27వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస భవనాల నిర్మాణాలకు శరవేగంగా అనుమతులు మంజూరు […]

Advertisement
Update: 2015-10-16 23:45 GMT

చంద్రబాబును అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలలో భారీగా భూములను సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన సినీ నటుడు, రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఇప్పుడు అందరి కంటే ముందుగానే అమరావతిలోనూ తన ”జయభేరి” జెండా ఎగరేసేందుకు సిద్ధమయ్యారు.

రాజధాని ప్రాంతంలో లేఅవుట్లకు, నిర్మాణాలకు అనుమతులివ్వడం కుదరదని చెబుతున్న ప్రభుత్వం మురళీమోహన్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా లక్షా 27వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస భవనాల నిర్మాణాలకు శరవేగంగా అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటి (SEIAA)ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది.

సెప్టెంబర్‌ 8న సమావేశమైన (SEIAA) ”జయభేరి” సంస్థ నిర్మాణాలకు జయహో చెప్పేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లి వద్ద ”జయభేరి” సంస్థ భారీ స్థాయిలో రెసిడెన్సియల్ అపార్ట్‌మెంట్లు నిర్మించబోతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మురళీమోహన్‌ నిర్మాణాలు చేపట్టబోతున్న ప్రాంతం రాజధాని ప్రాంతానికి చాలాచాలా దగ్గరగా ఉంటుంది. కానీ ఎంపీ గారి భూములు మాత్రం ల్యాండ్ పూలింగ్‌ కింద తీసుకోలేదు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది.

రాజధాని చుట్టూ చంద్రబాబు బినామీలు వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఇప్పటికే విపక్షాలు పెద్దెత్తున ఆరోపిస్తున్నాయి. మురళీమోహన్‌కు చెందిన జయభేరి నిర్మాణాలతో ఈ ఆరోపణలకు బలం చేకూరే అవకాశం ఉంది. అయితే దీనిపై స్పందించేందుకు మురళీ మోహన్ ఇష్టపడడం లేదు. జయభేరి చంద్రబాబు బినామీ కంపెనీ అని కూడా విపక్షాలు ఆరోపిస్తుంటాయి.

Tags:    
Advertisement

Similar News