గళమెత్తిన కలాలు

కల్బుర్గి మరణం కదిలించింది. దాద్రీ దారుణం పోరాటానికి పిలుపునిచ్చింది. సాహితీవేత్తలు స్వేచ్ఛా సమరం వైపు కదం తొక్కారు. భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండించారు. కలాలు గళమెత్తి నినదించాయి. కన్నడ రచయిత, హేతువాది ఎంఎం కల్బుర్గి హత్య, దాద్రీలో పశుమాంసం తిన్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటనపై సాహితీలోకం నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిరసన సెగలు సర్కారుకు తగులుతున్నాయి. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు కొందరు తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేయగా.. […]

Advertisement
Update: 2015-10-12 03:24 GMT

కల్బుర్గి మరణం కదిలించింది. దాద్రీ దారుణం పోరాటానికి పిలుపునిచ్చింది. సాహితీవేత్తలు స్వేచ్ఛా సమరం వైపు కదం తొక్కారు. భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండించారు. కలాలు గళమెత్తి నినదించాయి. కన్నడ రచయిత, హేతువాది ఎంఎం కల్బుర్గి హత్య, దాద్రీలో పశుమాంసం తిన్నాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటనపై సాహితీలోకం నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిరసన సెగలు సర్కారుకు తగులుతున్నాయి. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు కొందరు తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వెనక్కి ఇచ్చేయగా.. మరికొందరు సాహిత్య అకాడమీలో సభ్యత్వాన్ని వదులుకున్నారు. తాజాగా మరో కన్నడ రచయిత, పరిశోధకుడు డాక్టర్ అరవింద్ మలగట్టి.. సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మలగట్టితోపాటు పంజాబ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ రచయితలు గుర్బచన్ భుల్లార్, అజ్మేర్‌సింగ్ ఔలక్, అతమ్‌జిత్‌సింగ్, గుజరాతీ రచయిత, గిరిజన ఉద్యమకారుడు గణేశ్ దేవీ కూడా తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనుకకు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన కుమ్ వీరభద్రప్ప, ఢిల్లీకి చెందిన అమన్ సేథి కూడా తమ అవార్డులను వాపసు ఇస్తున్నట్లు ప్రకటించారు.

స్పందించిన సాహిత్య అకాడమీ
కవులు, కళాకారులు, సాహితీవేత్తల నుంచి నిరసనలు రోజు రోజుకు తీవ్రం అవుతుండడంతో సాహిత్య అకాడమీ ఎట్టకేలకు స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడేందుకు కృషి చేస్తామని సాహిత్య అకాడమీ చైర్మన్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ తెలిపారు. కల్బుర్గి హత్య పట్ల అకాడమీ స్పందించలేదన్నది అవాస్తవమని, దీనిపై త్వరలో జరిగే సమావేశంలో తీర్మానం కూడా చేస్తామని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News