ఇండియాకు అంతసీన్‌ లేదన్న చైనా

భారత్‌ సమీప భవిష్యత్తులో చైనాను దాటేసేంత సీన్‌ లేదని ఆ దేశం రుసరుసలాడుతోంది. అటువంటి ఊహ కూడా అవసరం లేదని, ఇండియాకు అంతటి సామర్థ్యం లేదని కొట్టిపడేసింది. చైనా ఇలా అగ్గిమీద గుగ్గిలంలా మారడానికి కారణం న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనమే. భారత్ ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికన్ కంపెనీలతో సమావేశమైన తర్వాత పలు కంపెనీలు చైనా కంటే ఇండియా వైపే చూస్తున్నాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇండియాలో ఉన్న సరళీకృత విధానాలే […]

Advertisement
Update: 2015-10-08 13:08 GMT

భారత్‌ సమీప భవిష్యత్తులో చైనాను దాటేసేంత సీన్‌ లేదని ఆ దేశం రుసరుసలాడుతోంది. అటువంటి ఊహ కూడా అవసరం లేదని, ఇండియాకు అంతటి సామర్థ్యం లేదని కొట్టిపడేసింది. చైనా ఇలా అగ్గిమీద గుగ్గిలంలా మారడానికి కారణం న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనమే. భారత్ ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికన్ కంపెనీలతో సమావేశమైన తర్వాత పలు కంపెనీలు చైనా కంటే ఇండియా వైపే చూస్తున్నాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇండియాలో ఉన్న సరళీకృత విధానాలే అందుకు కారణమని పేర్కొంది. దీనిని జీర్ణించుకోలేని చైనా మీడియా.. ఇండియా ఎప్పటికీ చైనాను అధిగమించలేదని, ప్రధాని మోదీ కలలుగంటున్న డిజిటల్ ఇండియాకు అంతసీన్ లేదని వ్యాఖ్యానించింది.

Tags:    
Advertisement

Similar News