wonder world 48

అలలపై లగ్జరీ షికారు! డబ్బున్న మారాజుల కోసం అనేక అధునాతన సదుపాయాలతో ‘సాగరకన్యలు’ సిద్ధమవుతున్నాయి. సెలవుల్లో సరదాగా గడపడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా పలు సంస్థలు సాగరవిహార ప్యాకేజీలు ప్రకటిస్తూనే ఉంటాయి. లగ్జరీ షిప్‌లు మాత్రం వీటిలో మరింత ప్రత్యేకమైనవి. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం, పలు అవాంతరాలు చోటు చేసుకుంటుండడంతో కొద్ది సంవత్సరాలుగా లగ్జరీ షిప్పుల తయారీ ఆగిపోయింది. విహారయాత్రలు కూడా కుంటుబడ్డాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన సదుపాయాలతో ఓ లగ్జరీ షిప్‌ను తయారు చేయడానికి […]

Advertisement
Update: 2015-10-05 13:04 GMT

అలలపై లగ్జరీ షికారు!

డబ్బున్న మారాజుల కోసం అనేక అధునాతన సదుపాయాలతో ‘సాగరకన్యలు’ సిద్ధమవుతున్నాయి. సెలవుల్లో సరదాగా గడపడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా పలు సంస్థలు సాగరవిహార ప్యాకేజీలు ప్రకటిస్తూనే ఉంటాయి. లగ్జరీ షిప్‌లు మాత్రం వీటిలో మరింత ప్రత్యేకమైనవి. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడం, పలు అవాంతరాలు చోటు చేసుకుంటుండడంతో కొద్ది సంవత్సరాలుగా లగ్జరీ షిప్పుల తయారీ ఆగిపోయింది. విహారయాత్రలు కూడా కుంటుబడ్డాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత అధునాతనమైన సదుపాయాలతో ఓ లగ్జరీ షిప్‌ను తయారు చేయడానికి ‘రాయల్‌ కరేబియన్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ నడుం బిగించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అది ఓ ప్రకటనలో వెల్లడించింది. షిప్‌ నమూనాను, అందులో ఉండే సదుపాయాల వివరాలను గ్రాఫిక్స్‌ రూపంలో అది తెలియజేసింది. స్కై డైవింగ్‌ సదుపాయం కూడా ఉండడం ఈ షిప్‌ ప్రత్యేకత ఇలాంటి సదుపాయం మునుపెన్నడూ ఏ షిప్‌లోనూ లేదు. షిప్‌ పైన సముద్రానికి 300 అడుగుల ఎత్తులో చుట్టూ తిరుగుతూ ఉండే ఓ గాజు గదిలో నిలబడి సాగరసౌందర్యాన్ని వీక్షించడం అద్భుతమైన అనుభూతినిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. ఈ గాజు గదిలో ఒకేసారి 14 మంది వరకూ కూర్చునే సదుపాయముంది. ఇంకా షిప్‌లో 80 అంగుళాల ఎల్‌ఈడీ స్క్రీన్‌ ముందు కూర్చుని సముద్రకెరటాలను వీక్షించవచ్చు. సముద్ర తీరంలో ఇల్లు ఉంటే… ఆ ఇంటి బాల్కనీలో కూర్చుని సముద్రాన్ని చూస్తుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతిని ఈ వర్చువల్‌ బాల్కనీ మనకు అందిస్తుంది. అంతేకాదు ఈ షిప్‌లో ఇంకా అనేక ‘ఆట’విడుపు కేంద్రాలు కూడా ఉన్నాయి. బంపర్‌ కార్లు, రోలార్‌ స్కేటింగ్‌, సర్కస్‌ స్కూల్‌ వంటివెన్నో థ్రిల్లింగ్‌ ఈవెంట్స్‌ ఈ షిప్‌లో ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News