అమీర్‌పేట భూమి కేసులో రోశయ్యకు ఉపశమనం

అమీర్‌పేట భూమి కేటాయింపు కేసులో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ఆధారాలు లేవంటూ హైకోర్టు కేసును కొట్టి వేసింది. అమీర్‌పేటలోని తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో ఎసిబి డైరెక్టర్ జనరల్ కేసుకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కూడా కేసును కొట్టివేసింది. […]

Advertisement
Update: 2015-10-05 13:10 GMT

అమీర్‌పేట భూమి కేటాయింపు కేసులో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఊరట లభించింది. ఈ కేసులో ఆధారాలు లేవంటూ హైకోర్టు కేసును కొట్టి వేసింది. అమీర్‌పేటలోని తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో అవకతవకలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత కాలంలో ఎసిబి డైరెక్టర్ జనరల్ కేసుకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు కూడా కేసును కొట్టివేసింది. దీంతో రోశయ్యతోపాటు మిగిలిన 16 మందికి కూడా ఈ కేసులో ఉపశమనం లభించింది.

Tags:    
Advertisement

Similar News