‘పది’ స్టాంప్‌ పేపర్లకు త్వరలో మంగళం

రాష్ట్రంలో ఇకపై 10 రూపాయల నాన్‌ జుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు విక్రయించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, స్టాంప్‌ వెండర్ల వద్ద ఉన్న స్టాక్‌ పూర్తయ్యే వరకు మాత్రమే వీటి విక్రయం జరగాలని, ఆ తర్వాత రూ.10 స్టాంప్‌ పేపర్‌పై లావాదేవీలను జరపరాదని ఆదేశించింది. కుల, స్థానిక, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుతోపాటు ప్రతీ సేవకు సమర్పించే అఫిడవిట్‌కు ఇకపై రూ.20 స్టాంప్‌ పేపర్‌ సమర్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దాంతోపాటు చిట్‌ అగ్రిమెంట్‌ […]

Advertisement
Update: 2015-10-05 13:05 GMT

రాష్ట్రంలో ఇకపై 10 రూపాయల నాన్‌ జుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు విక్రయించరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, స్టాంప్‌ వెండర్ల వద్ద ఉన్న స్టాక్‌ పూర్తయ్యే వరకు మాత్రమే వీటి విక్రయం జరగాలని, ఆ తర్వాత రూ.10 స్టాంప్‌ పేపర్‌పై లావాదేవీలను జరపరాదని ఆదేశించింది. కుల, స్థానిక, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తుతోపాటు ప్రతీ సేవకు సమర్పించే అఫిడవిట్‌కు ఇకపై రూ.20 స్టాంప్‌ పేపర్‌ సమర్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దాంతోపాటు చిట్‌ అగ్రిమెంట్‌ కూడా రూ.20 పేపర్‌పై జరగాలని నిర్ణయించడంతో కీలక ఒప్పందాలకు ఇక రూ. 20 నాన్‌ జ్యూడీషియల్‌ స్టాంప్‌ పేపర్లే ఉపయోగించాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News