తలసానిపై స్పీకర్‌దే నిర్ణయం: గవర్నర్‌

టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిగా కొనసాగించాలా వద్దా అనేది తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తెలిపారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ […]

Advertisement
Update: 2015-10-04 13:14 GMT

టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రిగా కొనసాగించాలా వద్దా అనేది తేల్చాల్సింది అసెంబ్లీ స్పీకర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ తెలిపారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. టీడీపీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ మంత్రిగా కొనసాగుతుండటంపై మీడియా ప్రశ్నించగా.. ‘తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ స్పీకరే’ అని సమాధానమిచ్చారు.

Tags:    
Advertisement

Similar News