దేశవ్యాప్తంగా లారీల సమ్మె విరమణ

దేశవ్యాప్తంగా ఐదు రోజుల నుంచి చేస్తున్న లారీల సమ్మెకు తెరపడింది. షిప్పింగ్,రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్‌ కార్యదర్శి వైవి ఈశ్వరరావు తెలిపారు. ఆలిండియా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కేంద్రంతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన తెలిపారు. లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని, డిసెంబర్‌ 15లోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారని ఈశ్వరరావు తెలిపారు. తమ […]

Advertisement
Update: 2015-10-05 11:26 GMT

దేశవ్యాప్తంగా ఐదు రోజుల నుంచి చేస్తున్న లారీల సమ్మెకు తెరపడింది. షిప్పింగ్,రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్‌ కార్యదర్శి వైవి ఈశ్వరరావు తెలిపారు. ఆలిండియా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కేంద్రంతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన తెలిపారు. లారీ ఓనర్ల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని, డిసెంబర్‌ 15లోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆయన తెలిపారని ఈశ్వరరావు తెలిపారు. తమ సమస్యలు మొత్తం ఆయన దృష్టికి తీసుకుకెళ్ళామని, సమస్యలను ఆయన అర్ధం చేసుకున్నారని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News