మన టీచర్లకు చదువు చెప్పడం రాదట!

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కంటే ముందుగా టీచర్లకే శిక్షణ అవసరం అంటోంది కేంద్ర ప్రభుత్వ నివేదిక. ”ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా” పేరుతో కేంద్ర మానవవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక చూస్తే దిమ్మదితగడం ఖాయం. టీచర్లకు తలవంపుల తెచ్చేలా ఈ నివేదకలో దిగ్ర్భాంతికర విషయాలున్నాయి. తెలంగాణలో ఎలిమెంటరీ స్కూళ్లలో  కేవలం 3.74 శాతం మంది టీచర్లకు మాత్రమే విద్య ఎలా బోధించాలో తెలుసని తేల్చింది. మిగిలిన వారికి పిల్లలకు ఎలా చదువు చెప్పాలో కొంచెం […]

Advertisement
Update: 2015-10-05 00:20 GMT

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల కంటే ముందుగా టీచర్లకే శిక్షణ అవసరం అంటోంది కేంద్ర ప్రభుత్వ నివేదిక. ”ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా” పేరుతో కేంద్ర మానవవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక చూస్తే దిమ్మదితగడం ఖాయం. టీచర్లకు తలవంపుల తెచ్చేలా ఈ నివేదకలో దిగ్ర్భాంతికర విషయాలున్నాయి.
తెలంగాణలో ఎలిమెంటరీ స్కూళ్లలో కేవలం 3.74 శాతం మంది టీచర్లకు మాత్రమే విద్య ఎలా బోధించాలో తెలుసని తేల్చింది. మిగిలిన వారికి పిల్లలకు ఎలా చదువు చెప్పాలో కొంచెం కూడా తెలియదని వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 86వేల 316 మంది టీచర్లు ఉండగా 3 వేల 200 మందికి మాత్రమే విద్యాబోధనలో సరైన నైపుణ్యం ఉందని మానవవనరుల శాఖ నివేదిక చెబుతోంది.
ఏపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఇక్కడ 9. 40 శాతం మంది టీచర్లకు మాత్రమే ఎలిమెంటరీ విద్య బోధించడం తెలుసని వెల్లడించింది. మిగిలిన ఉపాధ్యాయులందరికీ సరైన నైపుణ్యం లేదని తేల్చేసింది. దక్షిణభారత దేశంలో కర్నాటక, తమిళనాడులో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. కర్నాటకలో21. 06 శాతం మంది ఉపాధ్యాయకులకు ఎలిమెంటరీ స్కూల్ విద్యాబోధనలో సరైన నైపుణ్యం ఉందని తేల్చింది. తమిళనాడులో ఈ శాతం 19. 57గా ఉంది.

Tags:    
Advertisement

Similar News