5 రోజులపాటు పాన్ కార్డుల జారీ నిలిపివేత

పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్) జారీని ఐదు రోజులపాటు నిలిపి వేయనున్నట్లు ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పాన్ కార్డుల జారీని నిలిపివేయనున్నట్లు తెలిపింది. అయితే కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి నుంచి అప్లికేషన్ల స్వీకరణ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. పాన్‌కార్డు కోసం ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్‌ఎల్ వెబ్‌పోర్టళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ […]

Advertisement
Update: 2015-10-04 13:11 GMT

పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (పాన్) జారీని ఐదు రోజులపాటు నిలిపి వేయనున్నట్లు ఆదాయం పన్ను శాఖ ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు పాన్ కార్డుల జారీని నిలిపివేయనున్నట్లు తెలిపింది. అయితే కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి నుంచి అప్లికేషన్ల స్వీకరణ మాత్రం యథాతథంగా కొనసాగుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది. పాన్‌కార్డు కోసం ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐఐటీఎస్‌ఎల్ వెబ్‌పోర్టళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా నిలిచిపోయిన పాన్ కార్డుల జారీని ఆ తర్వాత మూడు రోజుల్లో క్లియర్ చేయనున్నట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News