బంగారు తెలంగాణ కోసం కొత్త జల విధానం

7 నుంచి 9 వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం- ప్రసంగానికి గవర్నర్‌కి కేసీఆర్‌ ఆహ్వానం తెలంగాణ జల విధానాన్ని ఆవిష్కరించడానికి శాసనసభ, శాసనమండలిల ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాల్సిందిగా గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును ఆహ్వానించారు. తెలంగాణలో నీటి వనరులు, సాగునీటి రంగంపై రూపొందించిన జల విధానంపై చర్చించేందుకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నామని, దీన్ని ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు తెలిపారు. […]

Advertisement
Update: 2015-10-02 20:31 GMT

7 నుంచి 9 వరకు ఉభయ సభల సంయుక్త సమావేశం- ప్రసంగానికి గవర్నర్‌కి కేసీఆర్‌ ఆహ్వానం
తెలంగాణ జల విధానాన్ని ఆవిష్కరించడానికి శాసనసభ, శాసనమండలిల ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించాల్సిందిగా గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావును ఆహ్వానించారు. తెలంగాణలో నీటి వనరులు, సాగునీటి రంగంపై రూపొందించిన జల విధానంపై చర్చించేందుకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నామని, దీన్ని ఈ నెల 7 నుంచి మూడు రోజులపాటు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్‌ గవర్నర్‌కు తెలిపారు. నాలుగు గంటలపాటు జరిగిన వీరి సమావేశంలో హైదరాబాద్‌లో నిర్మించ తలపెట్టిన ఎక్స్‌ప్రెస్‌ ప్లైఓవర్లు, ఆకాశ హార్మ్యాలు, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ భారీ భవనాలు వంటి అంశాలపై గవర్నర్‌కు కేసీఆర్‌ వివరించినట్టు తెలిసింది. సాగునీటిపారుదల అధికారులు కూడా వీరి భేటీలో పాల్గొని జలవిధానాన్ని వివరించినట్టు తెలిసింది.
గత ప్రభుత్వాలు రూపొందించిన జల విధానాలను రీ డిజైన్‌ చేస్తున్న కేసీఆర్‌ దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు ఉభయ సభలలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో సభ్యుల సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని, చర్చ అనంతరం జల విధానాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులను ఎందుకు రీ డిజైన్‌ చేయాల్సి వచ్చిందో… గత ప్రభుత్వాలు ఎలా అన్యాయం చేశాయో ఈ సమావేశంలో వివరిస్తారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక అవలంభిస్తున్న తీరు, వారు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల గురించి ఈ సభలో అందరికీ తెలియజేయాలని నిర్ణయించారు. అంతరాష్ట్ర జల వివాదాల్లో రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాలను కూడా సభ్యులకు తెలియజేస్తారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది.

Tags:    
Advertisement

Similar News