భారతీయ ఐటీ కంపెనీలకు ఊరట

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు హెచ్1బీ వీసాల విషయంలో అమెరికాలో కొంత ఊరట లభించింది. ప్రధానంగా ఇండియన్ ఐటీ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని అమెరికా ప్రభుత్వం విధించిన హెచ్1బీ ఔట్‌సోర్సింగ్ రుసుముకు సంబంధించిన బిల్లు గడువు ముగిసింది. గడిచిన కొన్నేళ్ళలో ఈ రుసుము కింద భారత ఐటీ సంస్థలు లక్షల కొద్ది డాలర్లు చెల్లించాయి. 2010లో అమలులోకి తెచ్చిన ఈ ప్రకారం.. అమెరికా కార్యాలయాల్లో 50 శాతం కంటే అధికంగా విదేశీ సిబ్బంది పని చేస్తున్న పక్షంలో ఐటీ […]

Advertisement
Update: 2015-10-02 13:07 GMT

భారతీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలకు హెచ్1బీ వీసాల విషయంలో అమెరికాలో కొంత ఊరట లభించింది. ప్రధానంగా ఇండియన్ ఐటీ కంపెనీలను దృష్టిలో పెట్టుకొని అమెరికా ప్రభుత్వం విధించిన హెచ్1బీ ఔట్‌సోర్సింగ్ రుసుముకు సంబంధించిన బిల్లు గడువు ముగిసింది. గడిచిన కొన్నేళ్ళలో ఈ రుసుము కింద భారత ఐటీ సంస్థలు లక్షల కొద్ది డాలర్లు చెల్లించాయి. 2010లో అమలులోకి తెచ్చిన ఈ ప్రకారం.. అమెరికా కార్యాలయాల్లో 50 శాతం కంటే అధికంగా విదేశీ సిబ్బంది పని చేస్తున్న పక్షంలో ఐటీ కంపెనీలు ఒక్కో విదేశీ ఉద్యోగిపై హెచ్1బీ ఫీజు కింద 2000 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. ఇపుడు దీన్ని కొంత సడలించారు.

Tags:    
Advertisement

Similar News