హిందుజా వద్ద వైసీపీ ధర్నా... పరవాడలో ఉద్రిక్తత

హిందూజా పవర్‌ప్లాంట్ నిర్వాసితులు, స్థానిక గ్రామస్తుల సమస్యల పరష్కారం కోసం వైసీపీ ధర్నాకు దిగడంతో విశాఖపట్నం జిల్లాలోని పరవాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హిందూజా వపర్‌ప్లాంట్ వల్ల భూములు, ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంతవరకు పరిహారం ఇవ్వకపోవడం పట్ల గ్రామస్తులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని అందిపుచ్చుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లాంట్ వద్ద ధర్నాకు దిగింది. వైసీపీ నాయకుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అప్పికొండ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా […]

Advertisement
Update: 2015-10-02 13:11 GMT

హిందూజా పవర్‌ప్లాంట్ నిర్వాసితులు, స్థానిక గ్రామస్తుల సమస్యల పరష్కారం కోసం వైసీపీ ధర్నాకు దిగడంతో విశాఖపట్నం జిల్లాలోని పరవాడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హిందూజా వపర్‌ప్లాంట్ వల్ల భూములు, ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంతవరకు పరిహారం ఇవ్వకపోవడం పట్ల గ్రామస్తులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని అందిపుచ్చుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లాంట్ వద్ద ధర్నాకు దిగింది. వైసీపీ నాయకుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అప్పికొండ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వైసీపీ నేతలను, కార్యకర్తలను, వారి వాహనాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పెద్దఎత్తున వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags:    
Advertisement

Similar News