wonder world 44

అతిపెద్ద షాపింగ్‌మాల్‌! మనదేశంలోకెల్లా అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ ఎక్కడుందో తెలుసా? కేరళలోని కొచ్చిలో ఉంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన లూలూ గ్రూప్‌ కంపెనీ భారత్‌లో ప్రారంభించిన తొలి షాపింగ్‌ మాల్‌ ఇది. 1600 కోట్ల రూపాయల ఖర్చుతో కొచ్చిలోని ఈడపల్లి జంక్షన్‌ వద్ద ఈ మాల్‌ను అది నిర్మించింది. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను 2013 మార్చి 10న ప్రారంభించారు. అత్యంత ఖరీదైన ఇంటర్నేషనల్‌ లగ్జరీ బ్రాండ్స్‌ అన్నీ […]

Advertisement
Update: 2015-10-01 13:04 GMT

అతిపెద్ద షాపింగ్‌మాల్‌!

మనదేశంలోకెల్లా అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ ఎక్కడుందో తెలుసా? కేరళలోని కొచ్చిలో ఉంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కి చెందిన లూలూ గ్రూప్‌ కంపెనీ భారత్‌లో ప్రారంభించిన తొలి షాపింగ్‌ మాల్‌ ఇది. 1600 కోట్ల రూపాయల ఖర్చుతో కొచ్చిలోని ఈడపల్లి జంక్షన్‌ వద్ద ఈ మాల్‌ను అది నిర్మించింది. 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను 2013 మార్చి 10న ప్రారంభించారు. అత్యంత ఖరీదైన ఇంటర్నేషనల్‌ లగ్జరీ బ్రాండ్స్‌ అన్నీ ఇక్కడ లభిస్తాయి. ఫుడ్‌కోర్టులు, కాఫీ షాప్స్‌, 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంటర్‌టెయిన్‌మెంట్‌ జోన్స్‌ ఈ మాల్‌లో అదనపు ఆకర్షణలు. ఇవి కాక దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్‌రింక్‌ను కూడా ఇక్కడ ఏర్పాటుచేశారు.
ఈ షాపింగ్‌ మాల్‌లో ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, అన్ని రకాల షాపులు దాదాపు 360 ఉన్నాయి. మెక్‌డొనాల్డ్స్‌ రెస్టారెంట్‌ కూడా ఒకటి ఇందులో ఉంది. ఈ కంపెనీ కేరళలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి రెస్టారెంట్‌ ఇదే.
మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ షాపింగ్‌ మాల్‌లో మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ప్రార్థనామందిరం, బేబీకేర్‌ సెంటర్‌ కూడా ఈ మాల్‌లో ఏర్పాటు చేశారు. ఈ మాల్‌లో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఒకేసారి మొత్తం 3,000 కార్లను పార్క్‌ చేయవచ్చు. బ్రిటన్‌కుచెందిన డబ్ల్యుఎస్‌ అట్‌కిన్స్‌ కన్సల్టెంట్‌ కంపెనీ ఈ మాల్‌ను డిజైన్‌ చేసింది.

Tags:    
Advertisement

Similar News