సిరియాపై తొలిసారి రష్యా వైమానిక దాడులు

సిరియాలో విచక్షణారహితంగా దాడులు చేస్తున్న ఉగ్రవాదులను తుద ముట్టించడమే లక్ష్యంగా రష్యా తొలిసారిగా వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా చేసిన వైమానిక దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మరణించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. సిరియాలోని రఖా నగరం పశ్చిమ ప్రాంతాల్లో తబ్ఖా మిలిటరీ విమానాశ్రయం సమీపంలో ఉగ్రవాద స్థావరాలపై రష్యా ఈ దాడులు చేసింది. సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌, సిరియా (ఐసీస్‌) ఉగ్రవాదులు చేస్తున్న దాడుల కారణంగా జరుగుతున్న అంతర్యుద్దానికి భయపడి […]

Advertisement
Update: 2015-10-01 13:11 GMT

సిరియాలో విచక్షణారహితంగా దాడులు చేస్తున్న ఉగ్రవాదులను తుద ముట్టించడమే లక్ష్యంగా రష్యా తొలిసారిగా వైమానిక దాడులకు దిగింది. ఉగ్రవాదుల స్థావరాలపై రష్యా చేసిన వైమానిక దాడుల్లో 12 మంది టెర్రరిస్టులు మరణించినట్టు అక్కడి అధికారులు తెలిపారు. సిరియాలోని రఖా నగరం పశ్చిమ ప్రాంతాల్లో తబ్ఖా మిలిటరీ విమానాశ్రయం సమీపంలో ఉగ్రవాద స్థావరాలపై రష్యా ఈ దాడులు చేసింది. సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌, సిరియా (ఐసీస్‌) ఉగ్రవాదులు చేస్తున్న దాడుల కారణంగా జరుగుతున్న అంతర్యుద్దానికి భయపడి లక్షలాది మంది ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా జోక్యం చేసుకుంది. దీనికి రష్యా పార్లమెంట్‌ అమోదం కూడా తెలిపింది. అయితే రష్యా వైమానిక దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది.

Tags:    
Advertisement

Similar News