గోనె సంచుల్లో రూ. 45 కోట్లు!

కొల్‌కతాలో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో ఆశ్చర్యకరమైన విధంగా 45 కోట్ల రూపాయల నగదు గోనె సంచుల్లో దొరికింది. 16 గోనె సంచుల్లో, 27 ట్రావెల్‌ బ్యాగుల్లో, 2 అల్మరాల్లో ఉంచిన ఈ నగదు కొద్ది సేపట్లో హవాలా మార్గంలో దుబాయ్‌కి తరలిస్తారనగా దీన్ని గుర్తించారు. ఈ నగదు నకిలీ లాటరీల రాకెట్‌ ద్వారా దావూద్‌ ఇబ్రహిం ముఠా సంపాదించినదని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడు వరకు వేళ్ళూనుకున్న ఈ నకిలీ లాటరీ రాకెట్‌ విషయం గురించి […]

Advertisement
Update: 2015-10-01 13:07 GMT

కొల్‌కతాలో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో ఆశ్చర్యకరమైన విధంగా 45 కోట్ల రూపాయల నగదు గోనె సంచుల్లో దొరికింది. 16 గోనె సంచుల్లో, 27 ట్రావెల్‌ బ్యాగుల్లో, 2 అల్మరాల్లో ఉంచిన ఈ నగదు కొద్ది సేపట్లో హవాలా మార్గంలో దుబాయ్‌కి తరలిస్తారనగా దీన్ని గుర్తించారు. ఈ నగదు నకిలీ లాటరీల రాకెట్‌ ద్వారా దావూద్‌ ఇబ్రహిం ముఠా సంపాదించినదని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడు వరకు వేళ్ళూనుకున్న ఈ నకిలీ లాటరీ రాకెట్‌ విషయం గురించి ఐటీ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు రెండు సంస్థలపై దాడులు చేయగా ఇంత పెద్ద మొత్తం లభించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సంస్థల యజమానులు పరారీలో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News