ఐఏఎస్‌లకు గడ్కారీ ఘాటు హెచ్చరిక

అభివృద్ధికి అడ్డుగా నిలిచే అధికారులను క్షమించబోమని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ హెచ్చరించారు. ‘చేయగలిగితే చిత్తశుద్దితో పని చేయండి… లేకపోతే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని ఇంటికి పొండి’ అని ఆయన ఐఏఎస్‌ అధికారులకు తెగేసి చెప్పారు. భారతదేశం ప్రపంచంతో పోటీ పడే పనిలో ఉందని, ఈ పోటీ అధికారుల్లో కూడా ఉండాలని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో అధికారులు ఆటంకంగా మారవద్దని వారికి తేల్చి చెప్పారు. జాతీయ రహదారులకు రోడ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌పై జరిగిన […]

Advertisement
Update: 2015-10-01 23:34 GMT

అభివృద్ధికి అడ్డుగా నిలిచే అధికారులను క్షమించబోమని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ హెచ్చరించారు. ‘చేయగలిగితే చిత్తశుద్దితో పని చేయండి… లేకపోతే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని ఇంటికి పొండి’ అని ఆయన ఐఏఎస్‌ అధికారులకు తెగేసి చెప్పారు. భారతదేశం ప్రపంచంతో పోటీ పడే పనిలో ఉందని, ఈ పోటీ అధికారుల్లో కూడా ఉండాలని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో అధికారులు ఆటంకంగా మారవద్దని వారికి తేల్చి చెప్పారు. జాతీయ రహదారులకు రోడ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌పై జరిగిన వర్క్‌షాపులో పాల్గొన్న నితిన్‌ గడ్కారీ రోజుకు వంద కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇది జరిగి తీరాలని ఆయన అన్నారు. ఈ క్రమంలో అధికారులెవరైనా అడ్డంకిగా మారితే క్షమించేది లేదని, అలసత్వం, జాప్యం సహించబోమని గడ్కారీ హెచ్చరించారు.
వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో అడ్డంకిగా మారితే ఐఏఎస్‌లైనా ఉపేక్షించబోమని నితిన్‌ గడ్కారీ హెచ్చరించారు. ‘అనుమతులు, ప్రాజెక్టుల నివేదికలు అన్నీ వేగిరంగా జరగాలి. సకాలంలో నిర్ణయాలు తీసుకోకుండా ఫైళ్ళను పెండింగ్‌లో పెడితే ఊరుకునేది లేదు. పని చేయడం ఇష్టం లేని ఉద్యోగులారా… దయచేసి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోండి. ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటే మేము వేగంగా మీ పని ముగిస్తాం’ అని ఘాటుగా హెచ్చరించారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి రోజుకు రెండు కిలోమీటర్లు మాత్రమే రోడ్డు నిర్మాణం జరిగేదని, ఇప్పుడు 18 కిలోమీటర్లకు పెరిగిందని, దీన్ని 100 కిలోమీటర్లకు పెంచాల్సిందేనని గడ్కారీ నికచ్చిగా చెప్పారు.

Tags:    
Advertisement

Similar News