అదేంటబ్బా... అలా వాయిదా వేశారు

గురువారం తెలంగాణ అసెంబ్లీ ఊహించని రీతిలో వాయిదా పడింది. సభ వాయిదా పడిన తీరును చూసి ప్రతిపక్షాలనే కాదు అధికారపక్ష సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు.  సభ ప్రారంభం కాగానే ఎప్పటిలాగే విపక్షాలు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టాయి.   టిడిపి పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అరెస్టుపై ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ పూర్తి కాలేదని.. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు సభకు అడ్డుపడ్డారు. రైతు సమస్యలపై రెండు రోజులు చర్చించామని […]

Advertisement
Update: 2015-09-30 13:09 GMT

గురువారం తెలంగాణ అసెంబ్లీ ఊహించని రీతిలో వాయిదా పడింది. సభ వాయిదా పడిన తీరును చూసి ప్రతిపక్షాలనే కాదు అధికారపక్ష సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. సభ ప్రారంభం కాగానే ఎప్పటిలాగే విపక్షాలు వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టాయి. టిడిపి పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అరెస్టుపై ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ పూర్తి కాలేదని.. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యులు సభకు అడ్డుపడ్డారు.

రైతు సమస్యలపై రెండు రోజులు చర్చించామని స్పీకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని విపక్షాలను కోరారు. కాని విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాయిదా తీర్మానాలపై విపక్షాలు ఆందోళన చేస్తే కాసేపు సభను వాయిదా వేసి అనంతరం ప్రశ్నోత్తరాలు చేపడుతుంటారు. కానీ స్పీకర్ ఏకంగా సభను సోమవారానికి వాయిదా వేయడంతో విపక్షాలు ఖంగుతిన్నాయి.

Tags:    
Advertisement

Similar News