సభ ముగిసినా అక్కడే విపక్షాల బైఠాయింపు

రైతు సమస్యలపై రెండు రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించినప్పటికీ విపక్షాలు సంతృప్తి చెందేలా ప్రభుత్వం నుంచి హామీ రాలేదు.  రైతు రుణాలు ఒకేసారి మాఫీకి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేసింది. అప్పటి వరకు సభను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌కు టీడీపీ, బీజేపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎంలు మద్దతు పలికాయి.  దీంతో సభ వాయిదా పడినప్పటికీ  విపక్షాలన్నీ అక్కడే బైఠాయించాయి..   ప్రభుత్వం స్పష్టమైన […]

Advertisement
Update: 2015-09-30 10:28 GMT
రైతు సమస్యలపై రెండు రోజుల పాటు సుధీర్ఘంగా చర్చించినప్పటికీ విపక్షాలు సంతృప్తి చెందేలా ప్రభుత్వం నుంచి హామీ రాలేదు. రైతు రుణాలు ఒకేసారి మాఫీకి స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేసింది. అప్పటి వరకు సభను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌కు టీడీపీ, బీజేపీ, వైసీపీ, సీపీఐ, సీపీఎంలు మద్దతు పలికాయి. దీంతో సభ వాయిదా పడినప్పటికీ విపక్షాలన్నీ అక్కడే బైఠాయించాయి.. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తేనే తాము అసెంబ్లీ నుంచి బయటకు వస్తామని విపక్ష సభ్యులు చెబుతున్నారు. ఎంఐఎం సభ్యులు మాత్రం సభ వాయిదా పడగానే వెళ్లిపోయారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ రెండు విడతలుగా రాత్రి తొమ్మిది గంటల వరకు సుధీర్ఘంగా రైతు సమస్యలపై చర్చించింది. అయితే ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులను మార్షల్స్‌ బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసులు విపక్ష సభ్యులను ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తరలించారు.
Tags:    
Advertisement

Similar News