చంద్రబాబుకు బుద్దీ, జ్ఞానం లేదు: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్దీ, జ్ఞానం లేదని, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆయనకు చీమ కుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి ఆరోపించారు. బుధవారం గుంటూరు జిల్లా టంగుటూరులో ఆత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతుల కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లిన ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు. వచ్చే ప్రభుత్వం తమదేనని, అప్పుడు రైతులకు న్యాయం […]

Advertisement
Update: 2015-09-30 05:44 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్దీ, జ్ఞానం లేదని, పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆయనకు చీమ కుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి ఆరోపించారు. బుధవారం గుంటూరు జిల్లా టంగుటూరులో ఆత్మహత్యలకు పాల్పడిన పొగాకు రైతుల కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లిన ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి పోయేకాలం దగ్గర పడిందని, త్వరలోనే మధ్యంతర ఎన్నికలు వస్తాయని అన్నారు. వచ్చే ప్రభుత్వం తమదేనని, అప్పుడు రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం టంగుటూరు పొగాకు కేంద్రంలో రూ. 34కే పొగాకును కొంటున్నారని, లోగ్రేడ్‌ పొగాకును కూడా రూ. 67కు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్నినా ఇక్కడ వ్యాపారులు దాన్ని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. జూన్‌ 30 వరకు కొనుగోళ్ళు జరిపి ఉంటే రైతులకు ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. బకాయిలను కూడా ఇంతవరకు చెల్లించలేదని రైతులు అక్కడే ధర్నాకు దిగితే దానికి వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు మద్దతు పలికారు. బోర్డు ఛైర్మన్‌ మల్లునాయుడును ఘెరావ్‌ చేశారు. రైతులకు పార్టీ అండగా ఉంటుందని జగన్‌ ప్రకటించారు. గత యేడాది కంటే ఈ యేడాది పొగాకు విస్తీర్ణం తగ్గిందని, దీన్నిబట్టి రేటు పెరగాలని కాని దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని, దీనికి కారణం వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావే కారణమని, ఆయన స్వార్థంతోనే రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. పొగాకు పండించడానికి మూడు నెలలు పడుతుంటే దాన్ని అమ్ముకోవడానికి రైతుకు పది నెలలు పట్టడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తాము రైతుల పక్షాన నిలబడి పోరాటం ఉధృతం చేస్తామని జగన్‌ హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News