నన్ను భయపెట్టలేరు: ఇరానీ

తాను ఎవరికీ భయపడే మహిళను కాదని కేంద్రం మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. నోటీసులిచ్చి బెదిరించాలని చూడటం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఆదివారం ఆమె రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో పర్యటించారు. గంగ్వాల్ గ్రామంలో కుశల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందే రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ట్రస్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆమెకు కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు  పంపింది. దీనిపై స్మృతీ ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. తనకు నోటీసులిచ్చి […]

Advertisement
Update: 2015-09-20 23:03 GMT
తాను ఎవరికీ భయపడే మహిళను కాదని కేంద్రం మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. నోటీసులిచ్చి బెదిరించాలని చూడటం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఆదివారం ఆమె రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో పర్యటించారు. గంగ్వాల్ గ్రామంలో కుశల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందే రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ట్రస్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆమెకు కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. దీనిపై స్మృతీ ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. తనకు నోటీసులిచ్చి బెదిరించాలని చూడటం తగదన్నారు. ఎన్ని నోటీసులు పంపినా తనను ఆపడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. తానేం ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడికి రాలేదని, అమేథీ ప్రజలకు మేలు చేసేందుకే వచ్చానన్నారు. ఇక్కడి సమస్యలపై తాను తప్పకుండా పోరాడుతానని, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ తనను జైల్లో పెట్టాలని సవాలు విసిరారు.
Tags:    
Advertisement

Similar News