భాజపాతో ర‌హ‌స్య ఒప్పందం లేదు : అసద్

భాజపాతో తాము ఎలాంటి రహస్య ఒప్పందం కుదుర్చుకోలేదంటూ.. మజ్లిస్ (ఏఐ ఎంఐఎం) పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తామూ భాజపా కుమ్మక్కయి పోటీ చేస్తున్నామంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తమకు సీమాంచల్ ప్రాంతంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టే.. పోటీ చేస్తున్నామని వివరించారు. తమ పార్టీపై ఆరోపణలు చేసిన జనతా పరివార్‌ పై ఆయన మండిపడ్డారు. వారి కూటమి వల్ల బీహార్ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. తాము కేవలం సీమాంచల్ […]

Advertisement
Update: 2015-09-20 20:42 GMT
భాజపాతో తాము ఎలాంటి రహస్య ఒప్పందం కుదుర్చుకోలేదంటూ.. మజ్లిస్ (ఏఐ ఎంఐఎం) పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తామూ భాజపా కుమ్మక్కయి పోటీ చేస్తున్నామంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. తమకు సీమాంచల్ ప్రాంతంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టే.. పోటీ చేస్తున్నామని వివరించారు. తమ పార్టీపై ఆరోపణలు చేసిన జనతా పరివార్‌ పై ఆయన మండిపడ్డారు. వారి కూటమి వల్ల బీహార్ ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. తాము కేవలం సీమాంచల్ ప్రాంతానికే పరిమితం కాదలుచుకోలేదని మనసులో మాటను బయటపెట్టారు అసద్. మరిన్ని ప్రాంతాల్లోనూ పోటీ చేసే ఆలోచన ఉందని వెల్లడించారు. అయితే, ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలన్నది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. బీహార్లో లౌకికపార్టీలకే విజయం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మతపరమైన ఎజెండాతో ఎన్నికలకు వచ్చేవారిని దూరంగా ఉంచాలని బీహార్ ప్రజలను కోరారు. త‌మ‌కు రావాల్సిన మైనార్టీ ఓట్లు చీల్చేందుకు బీజేపీనే బీహార్ బ‌రిలో మ‌జ్లిస్ ను పోటీకి దించుతోంద‌ని జ‌న‌తాప‌రివార్ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే! ఇందుకోసం మోదీ- ఒవైసీలు భేటీ అయి ర‌హ‌స్య ఒప్పందం కుదుర్చుకున్నార‌ని విమ‌ర్శించిన నేప‌థ్యంలో ఒవైసీ ఈ విధంగా స్పందించారు.
Tags:    
Advertisement

Similar News