యుద్ధరంగాన్ని తలపించిన జపాన్‌ పార్లమెంట్‌!

జపాన్‌ పార్లమెంట్‌ యుద్ధ రంగాన్ని తలపించింది. ఎంపీలు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒకరికొకరు తన్నుకున్నారు. భద్రతా చట్టానికి సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్షం నిలదీసింది. కమిటీ ఛైర్మన్‌ మీదకి దూసుకువచ్చింది. బిల్లును యధావిధిగా ప్రవేశపెడితే తాము ఉపేక్షించమని హెచ్చరిస్తూ మీదకి వచ్చారు. ముందు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ నేపథ్యంలో ఒకరినొకరు కొట్టుకోవడంతో చేసేది లేక ప్రధాని షింజో అబే కోపంగా సభ నుంచి వెళ్లి పోయారు. అతి కష్టం మీద కమిటీ ఛైర్మన్‌ను భద్రతా […]

Advertisement
Update: 2015-09-17 19:28 GMT
జపాన్‌ పార్లమెంట్‌ యుద్ధ రంగాన్ని తలపించింది. ఎంపీలు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఒకరికొకరు తన్నుకున్నారు. భద్రతా చట్టానికి సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్షం నిలదీసింది. కమిటీ ఛైర్మన్‌ మీదకి దూసుకువచ్చింది. బిల్లును యధావిధిగా ప్రవేశపెడితే తాము ఉపేక్షించమని హెచ్చరిస్తూ మీదకి వచ్చారు. ముందు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ నేపథ్యంలో ఒకరినొకరు కొట్టుకోవడంతో చేసేది లేక ప్రధాని షింజో అబే కోపంగా సభ నుంచి వెళ్లి పోయారు. అతి కష్టం మీద కమిటీ ఛైర్మన్‌ను భద్రతా సిబ్బంది సభ నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్ళారు. అయితే సభలోనున్న పార్లమెంట్‌లో సభ్యులు మాత్రం ఒకరినొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఉక్రెన్‌, కొరియా, సిరియా లాంటి దేశాల పార్లమెంట్‌లో జరుగుతున్న ఘటన ఇప్పుడు మొదటిసారిగా జపాన్‌ పార్లమెంట్‌లో జరిగింది. జపాన్‌ ఆర్మీ ఇతర దేశాలకు కూడా వెళ్లి పోరాడాలన్న ప్రతిపాదనను ఇందులో ప్రధాని తీసుకువచ్చారు. కాని పార్లమెంటులోనే ఎంపీలు రెచ్చిపోయి ఇలా తన్నుకోవడం ఇపుడు చర్చనీయాంశమైంది. ఈ బిల్లును దిగువ సభ ఆమోదించింది. ఇదే బిల్లు ఎగువ సభకు ఓటింగ్‌కు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.
Tags:    
Advertisement

Similar News