కోటిన్నర వజ్రం గుటకాయస్వాహా!

బ్యాంకాక్‌లో వజ్రాలు, నగల దుకాణానికి వెళ్ళిన ఓ చైనా కిలాడి మహిళ ఓ ఖరీదైన వజ్రంపై కన్నేసింది. వాటిలో కోటీ నలభై లక్షల విలువ చేసే ఓ వజ్రాన్ని చూసి దానిపై కన్నేసింది. ఎవరూ చూడడం లేదనుకుని చేతిలోకి తీసుకుని గబుక్కున మింగేసింది. మనుషులు చూడలేదు కానీ సీసీ కెమెరాలు పసిగట్టకుండా ఉంటుందా? చివరికి అదే ఈ కిలాడి దొంగను పట్టిచ్చింది. అంతే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వజ్రాన్ని తీసేందుకు ప్రయత్నాలు చేసి చివరికి […]

Advertisement
Update: 2015-09-16 13:15 GMT
బ్యాంకాక్‌లో వజ్రాలు, నగల దుకాణానికి వెళ్ళిన ఓ చైనా కిలాడి మహిళ ఓ ఖరీదైన వజ్రంపై కన్నేసింది. వాటిలో కోటీ నలభై లక్షల విలువ చేసే ఓ వజ్రాన్ని చూసి దానిపై కన్నేసింది. ఎవరూ చూడడం లేదనుకుని చేతిలోకి తీసుకుని గబుక్కున మింగేసింది. మనుషులు చూడలేదు కానీ సీసీ కెమెరాలు పసిగట్టకుండా ఉంటుందా? చివరికి అదే ఈ కిలాడి దొంగను పట్టిచ్చింది. అంతే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వజ్రాన్ని తీసేందుకు ప్రయత్నాలు చేసి చివరికి ఆస్పత్రిలో చేర్చారు. ఇంకేముంది డాక్టర్లు ఆమెకు ఆపరేషన్‌ చేసి ఆ కోటీ నలభై లక్షల వజ్రాన్ని బయటకు తీశారు. ఆమెకు ఇంకా ఏమైనా నేరాలతో సంబంధముందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News