పారిశ్రామికవేత్తలను ఆకట్టుకున్న కేసీఆర్‌ చైనా పర్యటన

తెలంగాణ పునర్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన చైనా పర్యటనలో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారు. దేశంలో కూడా పెట్టుబడులకు ఎంత సురక్షితమో వివరించారు. దేశంలోను ముఖ్యంగా తెలంగాణలోను కొత్త పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక వేత్తలకు ఎంత భరోసా ఉంటుందో వెలుగెత్తి చాటారు. పది రోజుల చైనా పర్యటనలో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు, చైర్మన్లతో సమావేశాలు నిర్వహించిన సీఎం కేసీఆర్… తెలంగాణలో పెట్టుబడులకు […]

Advertisement
Update: 2015-09-16 22:03 GMT
తెలంగాణ పునర్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన చైనా పర్యటనలో ప్రపంచం దృష్టిని ఆకర్షించగలిగారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రపంచ వేదికపై ఎలుగెత్తి చాటారు. దేశంలో కూడా పెట్టుబడులకు ఎంత సురక్షితమో వివరించారు. దేశంలోను ముఖ్యంగా తెలంగాణలోను కొత్త పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక వేత్తలకు ఎంత భరోసా ఉంటుందో వెలుగెత్తి చాటారు. పది రోజుల చైనా పర్యటనలో ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు, చైర్మన్లతో సమావేశాలు నిర్వహించిన సీఎం కేసీఆర్… తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూలంకషంగా వివరించడమే కాకుండా వారి దృష్టిని ఆకర్షించగలిగారు. అన్నింటికన్నా మిన్నగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై పారిశ్రామిక అంశాలను సూటిగా, క్లుప్తంగా చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. దేశం నుంచి వెళ్లిన ఏకైక ప్రతినిధి కావడంతో.. దేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు… ప్రధాని మోడి నాయకత్వంలో అభివృద్ధికి అవకాశాలను కూడా ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. ఈసందర్భంగా తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను కూడా వివరించడంలో సఫలీకృతులయ్యారు. పది రోజుల చైనా పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు చేరుకున్నది. చైనాలోని డాలియన్ నగరంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఏకైక ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రమే.
Tags:    
Advertisement

Similar News