నెహ్రూ, నాదెండ్లపై దృష్టి సారించిన జగన్‌?

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఉద్యమాలతో ఎప్పటికప్పుడు జనంలోకి వెళుతున్నా ఏజిల్లాకాజిల్లాలో పార్టీ బలంగా ఉండడం అవసరమని, ఒక్కనేత ఎంత తిరిగినా స్థానికంగా బలం లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై దృష్టి సారించింది. కృష్ణాజిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రుని, గుంటూరు జిల్లాకు సంబంధించి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ […]

Advertisement
Update: 2015-09-17 00:22 GMT
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. ఉద్యమాలతో ఎప్పటికప్పుడు జనంలోకి వెళుతున్నా ఏజిల్లాకాజిల్లాలో పార్టీ బలంగా ఉండడం అవసరమని, ఒక్కనేత ఎంత తిరిగినా స్థానికంగా బలం లేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదని పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై దృష్టి సారించింది. కృష్ణాజిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రుని, గుంటూరు జిల్లాకు సంబంధించి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం. ఎలాగో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి వైసీపీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న కోణంలో వీరిద్దరినీ ఒప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నెహ్రు పార్టీలోకి వస్తే జిల్లా అధ్యక్ష పదవికి కూడా అప్పగించే యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బొత్స కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. నెహ్రు రాకను జిల్లాలోని కొందరు వ్యతిరేకిస్తున్నా పార్టీ ప్రయోజనాల దృష్ణ్యా పట్టింపులు వద్దని వైసీపీ నేతలు సద్దిచెబుతున్నారని సమాచారం. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్న నెహ్రు, నాదెండ్ల ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే కావడం. కృష్ణా, గుంటూరుజిల్లాలో రాజకీయంగా అధిపత్యం చెలాయిస్తున్న కమ్మ సామాజికవర్గానికి దగ్గర చేసుకోవడం ద్వారా రెండు జిల్లాల్లో పార్టీ పట్టుపెరుగుతుందని వైసీపీ భావిస్తుందంటున్నారు.
Tags:    
Advertisement

Similar News