చిన్నారి పెళ్లి కూతురు ప్రేమలో పడింది?

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో యమ పాపులర్ అయింది అవికా గౌర్. ఆ తర్వాత తెలుగుతెరపై హీరోయిన్ గా కూడా మెరిసింది. ఉయ్యాలజంపాల సినిమాతో మంచి విజయాన్నందుకుంది. తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి సినిమాతో ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా సినిమా చూపిస్త మామ సినిమాతో మరో సక్సెస్ కొట్టేసింది. ఇలా అవికా గౌర్ ప్రయాణం టాలీవుడ్ లో సాఫీగా సాగిపోతోంది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ బయటకొచ్చింది.  Click to see […]

Advertisement
Update: 2015-09-11 19:03 GMT
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో యమ పాపులర్ అయింది అవికా గౌర్. ఆ తర్వాత తెలుగుతెరపై హీరోయిన్ గా కూడా మెరిసింది. ఉయ్యాలజంపాల సినిమాతో మంచి విజయాన్నందుకుంది. తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి సినిమాతో ఫర్వాలేదనిపించుకుంది. తాజాగా సినిమా చూపిస్త మామ సినిమాతో మరో సక్సెస్ కొట్టేసింది. ఇలా అవికా గౌర్ ప్రయాణం టాలీవుడ్ లో సాఫీగా సాగిపోతోంది. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ బయటకొచ్చింది.
 

Click to see AVIKA GOR LATEST STILLS 

ఆమె పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అవికాగౌర్ ఇప్పటివరకు రాజ్ తరుణ్ తో రెండు సినిమాలు చేసింది. కాబట్టి వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనే పుకార్లు బయటపడ్డాయి. కానీ తన సీరియల్ మిత్రుడు మనీష్ రాయ్ సంగాన్ తో అవికా డేటింగ్ చేస్తోందనే పుకార్లు వస్తున్నాయి. ఖాళీ దొరికినప్పుడల్లా అవికాగౌర్ ముంబయి చెక్కేయడానికి కారణం ఇదే అంటున్నారు చాలామంది. మరి ఈ రూమర్ పై చిన్నారి పెళ్లి కూతురు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    
Advertisement

Similar News