మధ్యప్రదేశ్‌లో భారీపేలుడు: 82 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబువా జిల్లాలో జరిగిన భారీ పేలుడులో సుమారు 82 మంది మృతి చెందారు. మూడంతస్తుల హోటల్ బిల్డింగ్‌లో గనుల తవ్వకాల్లో ఉపయోగించే బాంబులు పేలడంతో ఆ భవనంతో పాటు పక్కనున్న మరో భవంతి కూడా కుప్పకూలింది. దీంతో సుమారు 82 మంది చనిపోయారు.  పేలుడు ధాటికి హోటల్ కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న భవనాలు కూడా కూలిపోయాయి. ఈ ఘటనలో హోటల్ యజమాని కూడా మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక […]

Advertisement
Update: 2015-09-12 04:23 GMT
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబువా జిల్లాలో జరిగిన భారీ పేలుడులో సుమారు 82 మంది మృతి చెందారు. మూడంతస్తుల హోటల్ బిల్డింగ్‌లో గనుల తవ్వకాల్లో ఉపయోగించే బాంబులు పేలడంతో ఆ భవనంతో పాటు పక్కనున్న మరో భవంతి కూడా కుప్పకూలింది. దీంతో సుమారు 82 మంది చనిపోయారు. పేలుడు ధాటికి హోటల్ కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న భవనాలు కూడా కూలిపోయాయి. ఈ ఘటనలో హోటల్ యజమాని కూడా మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తొలుత హోటల్‌లోని గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటాయని అందరూ భావించారు. అయితే ఈ పేలుడుకు గనుల్లో ఉపయోగించే బాంబులే కారణమని ఆ తర్వాత పోలీసులు నిర్థారించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుంటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.పేలుడు ఘటనలో మృతులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.
Tags:    
Advertisement

Similar News